Tollywood : ఆ మూవీస్ కోసం జనాలందరూ వెయిటింగ్.! ఫ్యాన్స్ మరీనూ..
ప్రస్తుతం పుష్ప2 సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. సుకుమార్ డైరక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ఇప్పుడు చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఆల్రెడీ ఫస్ట్ పార్టుకు నేషనల్ లెవల్లో అద్భుతమైన స్పందన వచ్చింది. అందుకే ఇప్పుడు దాన్ని మించేలా ప్రతి విషయాన్ని డిజైన్ చేస్తోంది యూనిట్. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక అల్లు అర్జున్... అట్లీ డైరక్షన్‌లో ఓ సినిమా చేస్తారన్నది స్టార్ ఆర్మీని ఊరిస్తున్న మాట.

కథ గొప్పదా. ? కాంబినేషన్ గొప్పదా.? అంటే, ఇప్పుడున్న సిట్చువేషన్లలో ఒక్కదాన్ని ఛూజ్ చేసుకోవడం చాలా కష్టం. రెండూ ఇంపార్టెంట్ అనే అనాలి. ఇంకా స్ట్రెస్ చేసి అడిగితే, కాంబినేషన్‌తోనే బిజినెస్ క్రేజ్ వస్తుందని చెప్పాలి. అందుకే అలాంటి అద్దిరిపోయే కాంబినేషన్లలో సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా.? అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కొత్త కాంబినేషన్ల సంగతి పక్కనపెడితే, ఆల్రెడీ అనౌన్స్ అయిన కాంబోలు సెట్స్ మీదకు వస్తే చూడాలనే తాపత్రయం బాగా కనిపిస్తోంది ఆడియన్స్‌లో..
ప్రస్తుతం పుష్ప2 సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. సుకుమార్ డైరక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ఇప్పుడు చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఆల్రెడీ ఫస్ట్ పార్టుకు నేషనల్ లెవల్లో అద్భుతమైన స్పందన వచ్చింది. అందుకే ఇప్పుడు దాన్ని మించేలా ప్రతి విషయాన్ని డిజైన్ చేస్తోంది యూనిట్. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక అల్లు అర్జున్… అట్లీ డైరక్షన్‌లో ఓ సినిమా చేస్తారన్నది స్టార్ ఆర్మీని ఊరిస్తున్న మాట. ఆల్రెడీ జవాన్ ప్రమోషన్లలోనూ ఈ విషయాన్ని చూచాయగా చెప్పకనే చెప్పేశారు అట్లీ. ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఆల్రెడీ గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్, అట్లీ కాంబో గురించి ట్రేడ్ వర్గాల్లోనూ మంచి ఇంట్రస్ట్ కనిపిస్తోంది.
నా పవర్ హౌస్, నా ట్రాన్స్ ఫార్మర్ అంటూ తారక్‌ని ఇష్టంగా పిలుచుకుంటుంటారు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం దేవర పనులతో తారక్, సలార్ పనులతో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నారు. ఈ పనులన్నీ పూర్తి కాగానే వార్2 సెట్స్ కి వెళ్తారు తారక్. ఆయన కోసం స్క్రిప్ట్ సెట్ చేసి, ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేస్తారు నీల్. ”నేను దాదాపు 15 ఏళ్లుగా తారక్‌కి పెద్ద ఫ్యాన్‌ని. తనని ఇప్పటికే పది, పదిహేను సార్లు కలిశాను. తనని పూర్తిగా అబ్జర్వ్ చేసి కథ అల్లుకున్నాను” అంటూ ఇప్పటికే నీల్ చెప్పిన డీటైల్స్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.
అటు, డార్లింగ్ చేతిలో ఎన్ని సినిమాలున్నా, లోకేష్‌తో మూవీ ఎప్పుడనే విషయం మీద ఆసక్తి ఏమాత్రం తగ్గడం లేదు. ప్రభాస్‌కీ పెద్ద లైనప్ ఉంది. లోకేష్ లైనప్ కూడా బాగానే ఉంది. అవన్నీ కంప్లీట్ అయ్యాకే వీరి కాంబోలో సినిమా స్టార్ట్ అయ్యేది. 2024లో ఒకవేళ పూజా కార్యక్రమాలు జరుపుకున్నా, సెట్స్ మీదకు వెళ్లేసరికి 2025 అవుతుందేమో! రీసెంట్‌గా జిగర్తండ డబుల్ ఎక్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కార్తిక్ సుబ్బరాజ్‌కి ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు విక్టరీ వెంకటేష్. తన ఫ్రెండ్‌ని కార్తిక్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన తీరు తనకింకా కళ్లముందే మెదులుతుందని, ఆ తరహా ప్రాజెక్టుల్లో తనని తాను చూసుకోవాలని అనుకుంటున్నానని అన్నారు వెంకటేష్. విక్టరీ హీరోకి తగ్గట్టు స్క్రిప్ట్ సిద్ధం చేసి మెప్పించాల్సిన బాధ్యత కార్తిక్ సుబ్బరాజ్ మీద ఉంది.
అటు శంకర్ డైరక్షన్‌లో ఆల్రెడీ గేమ్ చేంజర్ చేస్తూనే ఉన్నారు రామ్‌చరణ్. ఈ సినిమా మీద హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. వచ్చే ఏడాది థియేటర్లలోకి దూసుకురానున్న ఈ సినిమా కోసం మెగాపవర్‌స్టార్ ఫ్యాన్స్ ఇష్టంగా వెయిట్ చేస్తున్నారు. మునుపెన్నడూ స్క్రీన్స్ మీదకు రాని ఈ కాంబినేషన్లు ఎప్పుడెప్పుడు మెటీరియలైజ్ అవుతాయా? బిజినెస్ ఫిగర్స్ ఎలా ఉంటాయా? అని అటు ట్రేడ్ పండిట్స్ కూడా ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు.
