AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: టీటీడీ బోర్డు మెంబర్‌గా బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం బెస్ట్ ఫ్రెండ్.. పవన్ గురించి ఏం చెప్పారంటే?

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ఇటీవల కొత్త పాలకవర్గం కొలువు దీరింది. టీటీడీ చైర్మన్ గా BR నాయుడుతో పాటు బోర్డు మెంబర్లు కూడా ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ బోర్డు మెంబర్స్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్లోజ్ ఫ్రెండ్ ఆనంద్ సాయి కూడా ఉన్నారు.

Pawan Kalyan: టీటీడీ బోర్డు మెంబర్‌గా బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం బెస్ట్ ఫ్రెండ్.. పవన్ గురించి ఏం చెప్పారంటే?
Pawan Kalyan, Anand Sai
Basha Shek
|

Updated on: Nov 08, 2024 | 9:08 AM

Share

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆర్డ్ డైరెక్టర్ ఆనంద్ సాయి క్లోజ్ ఫ్రెండ్స్. . తొలి ప్రేమ సినిమ కంటే వీరి మధ్య మంచి స్నేహం ఉంది. ఇక జనసేన ప్రయాణంలో, గెలిచాక కూడా పవన్ వెంట ఉంటున్నాడు ఆనంద్ సాయి. కొన్ని రోజుల క్రితం పవన్ వెంట ఆనంద్ సాయి కూడా వచ్చి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ బోర్డు మెంబర్ గా ఆనంద్ సాయికి ప్రాధాన్యం దక్కింది. తాజాగా ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేశారు. భార్య వాసుకీ, తదితర కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆనంద్ సాయి. అనంతరం టీటీడీ అర్చకుల వేదాశీర్వచనం అందుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. కాగా టీటీడీ బోర్డు మెంబర్ గా సెలెక్ట్ చేసినందుకు ఎమోషనల్ అయ్యారు ఆనంద్ సాయి. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఒక ఆసక్తికర పోస్ట షేర్ చేశాడు.

‘ నాపై నమ్మకముంచి ఈ అపురూపమైన గౌరవాన్ని నాకు కల్పించిన నా ప్రియ మిత్రుడు పవన్ కల్యాణ్ కు హృదయ పూర్వక ధన్యవాదాలు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాన్ని కాపాడడంలో ఆయన అంకితభావం నిజంగా స్ఫూర్తి దాయకం. పవన్ దార్శనికత, నాయకత్వం ఎంతో మందికి ఆదర్శం. ఆయన మార్గదర్శకత్వంలో పనిచేసినందుకు నేనెంతో కృతజ్ఞుడిని. టీటీడీ బోర్డు మెంబర్ గా అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతం. నాకున్న నైపుణ్యం, అనుభవంతో తిరుమల శ్రీవారికి సేవ చేసుకుంటాను’ అని రాసుకొచ్చారు ఆనంద్ సాయి.

ఇవి కూడా చదవండి

కుటుంబ సభ్యులతో ఆర్డ్ డైరెక్టర్  ఆనంద్ సాయి..

ప్రస్తుతం ఆనంద్ సాయి షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వాస్తు, ధర్మం మీద పట్టు ఉన్న ఆనంద్ సాయి లాంటి వాళ్ళు టీటీడీ బోర్డు మెంబర్ గా ఉండడం మంచి పరిణామమని అభిమానులు, నెటిజన్లు స్పందిస్తున్నారు. కాగా తొలిప్రేమ సినిమాలో పవన్ చెల్లెలిగా నటించిన వాసుకిని ఆనంద్ సాయి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

పవన్ వెంట ఆనంద్ సాయి..

ఏలూరు పర్యటనలో పవన్, ఆనంద్ సాయి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..