- Telugu News Photo Gallery Cinema photos Prabhas Spirit to Allu Arjun Pushpa 2 latest movie updates from tollywood
Movie News: స్పిరిట్ షూటింగ్ అప్పటినుంచే.. పుష్ప 2 ప్రమోషన్ జోరు..
ప్రభాస్ హీరోగా సందీప్ వంగ దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పిరిట్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్. కీర్తి సురేష్ రివాల్వర్ రీటా తెలుగు రైట్స్ ఎవరంటే.? అజయ్ దేవగన్ ఆజాద్ మూవీ అప్డేట్. నాని, శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ మూవీపై వార్త వైరల్. ప్రమోషన్స్ విషయంలోనూ నయా రికార్డ్స్ సెట్ చేస్తోంది పుష్ప 2 టీమ్. ఇలాంటి సినిమా అప్డేట్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం రండి..
Updated on: Nov 08, 2024 | 5:33 PM

స్పిరిట్ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చారు నిర్మాత భూషణ్ కుమార్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయన్న భూషణ్, డిసెంబర్ నెలాఖరున షూటింగ్ స్టార్ట్ చేస్తామన్నారు. ఆరు నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు.

కీర్తి సురేష్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన యాక్షన్ డ్రామా రివాల్వర్ రీటా. జేకే చంద్రు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులోనూ భారీగా రిలీజ్ చేస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌లో రాజేష్ దండా ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కుతున్న అడ్వంచర్ మూవీ ఆజాద్. అభిషేక్ కపూర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాతో అజయ్ వారసుడు అమన్ దేవగన్ హీరోగా పరిచయం అవుతున్నారు. రవీనా టండన్ కూతురు రాషా థడానీ హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

దసరా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాని, శ్రీకాంత్ ఓదెల మరో మూవీని ఎనౌన్స్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన న్యూస్, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీకి ప్యారడైజ్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.

ప్రమోషన్స్ విషయంలోనూ నయా రికార్డ్స్ సెట్ చేస్తోంది పుష్ప 2 టీమ్. అమెరికా థియేటర్లలో పాప్‌కార్న్ టబ్స్, కూల్ డ్రింక్ కప్స్‌ను పుష్ప 2 పోస్టర్స్‌తో డిజైన్ చేస్తున్నారు. నవంబర్ 14న రిలీజ్‌కు రెడీ అవుతున్న కంగువా మూవీ థియేటర్లలో పుష్ప 2 ప్రమోషన్స్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు.




