- Telugu News Photo Gallery Cinema photos Young Hero Nithin waiting for a hit Film in Tollywood With thammudu and RobinHood, Details Here
Nithin: హిట్ కోసం వెయిట్ చేస్తున్న నితిన్.! పవన్ కళ్యాణ్ నే ఆదుకోవాలేమో..
పెట్టిన బడ్జెట్‌కి పదింతలు లాభాలను ఎప్పుడు చూస్తామా? అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు నితిన్ అభిమానులు. ఇప్పుడైతే ఆయన ముందు రెండు సినిమాలున్నాయి. రాబిన్‌హుడ్ అండ్ తమ్ముడు. ఈ సినిమాల్లో ఆయన కోరిక నెరవేర్చే సినిమా ఏది.? అప్పట్లో వెంకీ కుడుముల తెరకెక్కించిన భీష్మ సినిమా తర్వాత చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదు నితిన్ ఖాతాలో.
Updated on: Nov 07, 2024 | 9:27 PM

పెట్టిన బడ్జెట్‌కి పదింతలు లాభాలను ఎప్పుడు చూస్తామా? అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు నితిన్ అభిమానులు.

ఇప్పుడైతే ఆయన ముందు రెండు సినిమాలున్నాయి. రాబిన్‌హుడ్ అండ్ తమ్ముడు. ఈ సినిమాల్లో ఆయన కోరిక నెరవేర్చే సినిమా ఏది.?

అప్పట్లో వెంకీ కుడుముల తెరకెక్కించిన భీష్మ సినిమా తర్వాత చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదు నితిన్ ఖాతాలో.

మళ్లీ కెరీర్ గాడిలో పడాలంటే వెంకీ కుడుముల అయితేనే కరెక్ట్ అనుకున్నారేమో.. ఆయనతో రాబిన్‌హుడ్ చేస్తున్నారు నితిన్. అన్నీ పనులు పూర్తయ్యాయి.

ఈ ఏడాది డిసెంబర్ 20న రాబిన్ హుడ్ రిలీజ్ అని గట్టిగా చెప్పేశారు మేకర్స్. శ్రీలీలతో నితిన్ ఆడిపాడింది ఈ మూవీలోనే. 2024 ఖాతాలో రాబిన్ హుడ్ ఉంటే, 2025కి రిలీజ్ అవుతోంది తమ్ముడు.

శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తమ్ముడు. అక్కా తమ్ముడు సెంటిమెంట్‌తో సినిమా ఉంటుందని సమాచారం. మారేడుమిల్లి పరిసరాల్లోనూ కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.

కెరీర్‌లో పర్ఫెక్ట్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న నితిన్‌ని పవర్‌స్టార్ టైటిల్ అయినా ఆదుకుంటుందా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు.




