Miss Shetty Mr Polishetty: జవాన్‌ను తట్టుకుని మరీ.. 50 కోట్లు దాటేసిన మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి వసూళ్లు

. మహేష్‌ బాబు తెరకెక్కించిన ఈ ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌ మూవీలో నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటించాడు. యువీ క్రియేషన్స్‌ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సినిమా 16 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆంధ్రా-తెలంగాణలోనే ఈ సినిమా 23 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.

Miss Shetty Mr Polishetty: జవాన్‌ను తట్టుకుని మరీ.. 50 కోట్లు దాటేసిన మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి వసూళ్లు
Miss Shetty Mr Polishetty Movie
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Sep 24, 2023 | 10:48 AM

‘బాహుబలి’ సిరీస్‌ సినిమాల తర్వాత అనుష్క శెట్టి సినీ పరిశ్రమకు దూరం అయ్యింది. ‘బాహుబలి’ చిత్రం తర్వాత, అనుష్క శెట్టి 2018లో ‘భాగమతి’ లో నటించింది. ఆ తర్వాత ఐదేళ్లలో కేవలం రెండు సినిమాల్లో మాత్రమే కనిపించింది. దీంతో సినిమా ఇండస్ట్రీలో అనుష్క శెట్టి టైం అయిపోయిందని టాక్‌ వినిపించింది. ఫేడవుట్‌ అయినట్లేనని కామెంట్లు గట్టిగానే వచ్చాయి. అయితే అనుష్క శెట్టి మాత్రం ఇప్పుడు సాలిడ్‌ కమ్‌ బ్యాక్‌ ఇచ్చింది. టాలీవుడ్‌లో తన క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదని మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమాతో నిరూపించుకుంది. మహేష్‌ బాబు తెరకెక్కించిన ఈ ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌ మూవీలో నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటించాడు. యువీ క్రియేషన్స్‌ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సినిమా 16 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆంధ్రా-తెలంగాణలోనే ఈ సినిమా 23 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఇర పక్క రాష్ట్రాలు, విదేశాల్లో సినిమా కలెక్షన్స్ అన్నీ కలిపితే సినిమా టోటల్ కలెక్షన్ 50 కోట్లకు పైగానే అని అంటున్నారు ట్రేడ్‌ పండితులు. షారుక్‌ ఖాన్‌ జవాన్‌ సినిమా పోటీని తట్టుకుని మరీ ఈ స్థాయి కలెక్షన్లు రావడం సంతోషంగా ఉందని దర్శక నిర్మాతలు అంటున్నారు.

కాగా మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమా విజయానికి అనుష్కతో పాటు నవీన్‌ పొలిశెట్టి కూడా ప్రధాన కారణం. ఇప్పటివరకు ఎక్కువగా కామెడీ రోల్స్‌లోనే మనం అతనిని చూశాం. అయితే ఈ సినిమాలో మొదటిసారిగా ఎమోషన్స్‌ను పండించి హ్యాట్రిక్‌ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడీ హీరో. ఈ సినిమాలో అనుష్క చెఫ్‌ గా కనిపించింది. స్వతంత్ర్య భావాలున్న ఆమె పెళ్లి చేసుకోకుండానే పిల్లలను కనాలని అనుకోవడం, బిడ్డను కనేందుకు తగిన యువకుడి కోసం వెతకడం, అప్పుడే నవీన్ పరిచయం కావడం.. ఆ తర్వాత వారిద్దరి ప్రయాణం సాగింది? అన్నది ఎంతో హృద్యంగా చూపించారు మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమాలో. మరి వారి బంధాన్ని సమాజం అంగీకరిస్తుందా? పెళ్లి బంధం, ఇతర సమస్యలు లేకుండా పిల్లలను కనడం సముచితమా అనే సున్నితమైన అంశాలను డైరెక్టర్‌ ఎంతో ఎమోషనల్‌గా చూపించారని ఈ సినిమాపై ప్రశంసలు వస్తున్నాయి. అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టితో పాటు పవిత్ర లోకేష్, మురళీ శర్మ, జయసుధ, నాజర్, హర్షవర్ధన్ తదితరులు ఈ సినిమాలో నటించారు. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ హక్కులు భారీ ధరకు విక్రయించారని సమాచారం.

ఇవి కూడా చదవండి

16 రోజుల్లో రూ. 50 కోట్లకు పైగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.