AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: తగ్గేదే లే అంటున్న మేకర్స్.. పుష్ప 2 సినిమా ప్రమోషన్స్‌కు అంత ఖర్చా..!

పుష్ప 2 రిలీజ్ కు ఇంకా సరిగ్గా నెల రోజులు మాత్రమే సమయం ఉంది. దాంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచనుంది. ఇప్పటికే పుష్ప 2 ప్రమోషన్స్ ను భారీగా నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేశారు.

Pushpa 2: తగ్గేదే లే అంటున్న మేకర్స్.. పుష్ప 2 సినిమా ప్రమోషన్స్‌కు అంత ఖర్చా..!
Pushpa 2
Rajeev Rayala
|

Updated on: Nov 05, 2024 | 1:00 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 రిలీజ్ కు ఇంకా సరిగ్గా నెల రోజులు మాత్రమే సమయం ఉంది. దాంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచనుంది. ఇప్పటికే పుష్ప 2 ప్రమోషన్స్ ను భారీగా నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. పుష్ప 1 భారీ విజయం సాధించడంతో ఇప్పుడు పుష్ప 2 పై అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఇక ఈ సినిమా మొదటి భాగానికి మించి ఉంటుందని తెలుస్తోంది. పుష్ప 2′ సినిమా నిర్మాణం కోసం దాదాపు 200 కోట్ల బడ్జెట్‌ను పెట్టారు మేకర్స్. అలాగే ప్రమోషన్స్ కోసం కూడా భారీగా ఖర్చు చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

ఇది కూడా చదవండి : బుర్రపాడు గురూ ఇది.! యమదొంగలో ఉన్న ఈ చిన్నది.. ఆ బిగ్ బాస్ హాట్ బ్యూటీనా..!

ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కోసం 50 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారని  టాక్ వినిపిస్తుంది. పుష్ప 2 సినిమా ప్రమోషన్ కోసం కొన్ని సంస్థలతో అగ్రిమెంట్ కుదుర్చుకున్న చిత్ర బృందం ఇప్పటికే సినిమా ప్రమోషన్ ప్లాన్ కూడా రెడీ చేసింది. ఇప్పటి వరకు జరిగిన భారీ పాన్ ఇండియా సినిమా ప్రమోషన్లకు భిన్నంగా ఈసారి ప్రమోషన్ చేసేందుకు ‘పుష్ప 2’ రెడీ అవుతోంది, అందుకే ఇంత భారీ బడ్జెట్‌ను కేటాయించారు.

ఇది కూడా చదవండి : Bhanu Priya: ఇదేందయ్యా ఇది.. ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ భాను ప్రియా చెల్లెలా..!!

వివిధ నగరాలకు వెళ్లి అక్కడ ఈవెంట్‌లు చేయడం ఇప్పటి వరకు చాలా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న పద్దతి, అయితే ‘పుష్ప 2’ టీమ్ కూడా దీనిని అనుసరిస్తుంది, కానీ కొంచెం భిన్నంగా సినిమాను ప్రమోట్ చేయనుంది. ఇండియాలోని ఆరు నగరాలను గుర్తించిన చిత్ర బృందం, ఆరు నగరాల్లో భారీ ప్రమోషనల్ ప్రోగ్రామ్ చేయనుంది. ప్రమోషన్ కోసం స్థానిక స్టార్ నటీనటులను కూడా ఆహ్వానిస్తారు.

ఇది కూడా చదవండి :Devara : అవకాశాలు పెరిగాయి.. ఎలాంటి పాత్ర అయినా రెడీ అంటున్న దేవర బ్యూటీ..!

భారత నగరాల్లోనే కాదు జపాన్, రష్యాల్లో కూడా ‘పుష్ప 2’ భారీ ప్రమోషన్స్ చేయనున్నారని తెలుస్తోంది. సాధారణంగా భారతీయ సినిమాలు దుబాయ్, అమెరికా నగరాల్లో విడుదలవుతాయి. దుబాయ్, అమెరికాతో పాటు జపాన్, రష్యాలో ఏకకాలంలో ‘పుష్ప 2’ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. 2021లో విడుదలైన ‘పుష్ప’కి జపాన్, రష్యాల్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఈసారి ఆ రెండు దేశాలను ప్రత్యేకంగా టార్గెట్ చేశారు. కాగా ‘పుష్ప 2’ విడుదలకు ముందే 500 కోట్లకు పైగా బిజినెస్ చేసిందని తెలుస్తోంది. అందుకే ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ సినిమా ప్రమోషన్ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us