కేన్స్ రెడ్ కార్పెట్‌పై అలియా మెరుపులు.. ఇండియన్ టచ్‌తో ఆకట్టుకున్న ‘దేశీ గర్ల్’!
గ్లోబల్ ఫ్యాషన్ వేదిక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026లో భారతీయ వెండితెర అందం అలియా భట్ మరోసారి తన మార్కును చాటుకున్నారు. ఫ్రెంచ్ రివేరా వీధుల్లో ఫెయిరీ టేల్ గౌనుతో మెరిసిన ఆమె, రెడ్ కార్పెట్‌పై ఇండియన్ టచ్‌తో కూడిన డ్రెస్సింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతర్జాతీయ స్థాయిలో తనదైన శైలిలో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటూ అలియా ఈ ఏడాది కూడా టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచారు.

కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు 2026 (Cannes 2026) వేదికగా భారతీయ నటి అలియా భట్ మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఫ్రెంచ్ రివేరాలో జరిగిన ఈ వేడుకలో లోరియల్ పారిస్ గ్లోబల్ అంబాసిడర్‌గా ఆమె రెడ్ కార్పెట్‌పై నడిచి అందరినీ మంత్రముగ్ధులను చేశారు. పగటిపూట ఒక అద్భుతమైన ఫెయిరీ టేల్ లుక్‌లో కనిపించిన అలియా, సాయంత్రం రెడ్ కార్పెట్ కోసం ఎంచుకున్న అవుట్‌ఫిట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఏడాది కేన్స్‌లో భారతీయ సినీ ప్రముఖుల సందడి విశేషంగా కనిపిస్తోంది.
బ్లష్-టోన్డ్ గౌను
అలియా భట్ రెడ్ కార్పెట్ కోసం ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ ‘తమరా రాల్ఫ్’ రూపొందించిన బ్లష్-టోన్డ్ గౌనును ఎంచుకున్నారు. ఈ స్ట్రాప్‌లెస్ గౌను కర్వ్డ్ బస్టియర్ నెక్‌లైన్ మరియు స్ట్రక్చర్డ్ కార్సెట్-స్టైల్ బాడీస్‌తో అలియా రూపాన్ని ఎంతో హుందాగా మార్చింది. అయితే, ఈ వెస్ట్రన్ అవుట్‌ఫిట్‌లో ఉన్న అసలైన విశేషం ఏమిటంటే.. ఆమె చేతులకు చుట్టుకున్న దుపట్టా లాంటి డ్రేప్. ఇది గ్లోబల్ వేదికపై భారతీయ వస్త్రధారణలోని సొగసును గుర్తుచేస్తూ ఒక ‘ఇండియన్ టచ్’ ఇచ్చింది. రియా కపూర్ స్టైలింగ్‌లో అలియా ధరించిన స్టేట్‌మెంట్ నెక్‌లెస్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఆమె ఎలిగెన్స్‌ను మరింత పెంచాయి.
అంతకుముందు, పగటిపూట జరిగిన కార్యక్రమంలో అలియా ‘యశ్ పాటిల్’ డిజైన్ చేసిన కస్టమ్ గౌనులో మెరిశారు. 1950ల నాటి ఐకానిక్ సిల్హౌట్‌ల స్ఫూర్తితో రూపొందించిన ఈ గౌనుపై బాసూరి చోక్సీ చేతితో గీసిన పెయింటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫ్రెంచ్ రివేరాలోని సుందర దృశ్యాలు, లావెండర్ పొలాలు మరియు రొమాన్స్‌ను ప్రతిబింబించేలా ఈ పెయింటింగ్‌ను రూపొందించారు. వింటేజ్ స్టైల్‌ను ఆధునిక హంగులతో కలిపి రూపొందించిన ఈ డ్రెస్సు ఒక అద్భుతమైన కళాఖండంలా కనిపించింది.

Alia Bhatt In Red Carpet
కేన్స్ వేదికపై రెండోసారి..
కేన్స్ వేదికపై అలియా భట్‌కు ఇది రెండవ ప్రదర్శన. 2025లో ఆమె తన తొలి ప్రవేశాన్ని చీరను తలపించే కస్టమ్ గుస్సీ (Gucci) అవుట్‌ఫిట్‌తో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కేన్స్‌లో అలియాతో పాటు ఐశ్వర్యరాయ్ బచ్చన్ కూడా లోరియల్ అంబాసిడర్‌గా తన మార్కును చూపించబోతున్నారు. వీరితో పాటు దర్శకులు అశుతోష్ గోవారికర్, కరణ్ జోహార్ మరియు నటీమణులు తారా సుతారియా, మౌనీ రాయ్, పూజా బత్రా వంటి వారు కూడా ఈ వేడుకలో పాల్గొంటున్నారు. మే 12 నుండి మే 23 వరకు ఫ్రాన్స్‌లో జరిగే ఈ మెగా ఈవెంట్ లో భారతీయుల సందడి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
