AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa Movie: పుష్ప షూటింగ్‏కు బ్రేక్ !!.. అల్లు అర్జున్ సినిమా ఆలస్యానికి కారణం అదేనా ?

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం నటిస్తున్న సినిమా పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి సుకుమార్

Pushpa Movie: పుష్ప షూటింగ్‏కు బ్రేక్ !!.. అల్లు అర్జున్ సినిమా ఆలస్యానికి కారణం అదేనా ?
Pushpa
Rajitha Chanti
| Edited By: |

Updated on: Sep 29, 2021 | 4:13 PM

Share

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం నటిస్తున్న సినిమా పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నాడు సుకుమార్. చాలా కాలం తర్వాత సుకుమార్, బన్నీ కలయికలో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, ఇంట్రడ్యూసింగ్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన దాక్కో దాక్కో మేక సాంగ్ యూట్యూబ్‏లో రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‏తో నిర్మిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాను క్రిస్మస్ సందర్బంగా విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా పూర్తి కావడానికి మరింత సమయం పట్టేలా ఉందని తెలుస్తోంది. దీంతో అనుకున్నా సమయానికి సినిమా విడుదల చేయగలమా అని సందేహం వ్యక్తం చేస్తున్నారట. ప్రస్తుతం పుష్ప షూటింగ్ చివరి దశలో ఉంది. ఇటీవలే మారేడు మిల్లి అటవీ ప్రాంతంలో లాంగ్ షెడ్యూల్ జరుపుకుంది. అయితే ఇందులో రెండు పాటలు, కొన్ని యాక్షన్ సన్నివేశాలు అక్కడే చిత్రీకరించాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో షూటింగ్‏కు బ్రేక్ పడిందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో గులాబ్ తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా షూటింగ్ జరిపే అవకాశం లేదని.. అందుకే పరిస్థితులు మెరుగుపడే వరకు షూటింగ్ వాయిదా వేయాలని చూస్తున్నారట మేకర్స్. ఒకవేళ పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. అక్టోబర్ చివరి నాటికి సినిమా పూర్తిచేయడం కష్టమే అంటున్నారు . దీంతో ఈ వర్షాల ప్రభావం.. సినిమా రిలీజ్ డేట్ పై ఎఫెక్ట్ కానున్నట్లుగా టాక్ నడుస్తోంది.

ఇదిలా ఉంటే.. ఇటీవలే.. ఈ సినిమాలో సెకండ్ సింగిల్ సాంగ్‏లో అద్భుతమైన ప్రదేశంలో చిత్రీకరించబోతున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. అందుకు సంబంధించిన లోకేషన్ ఫోటోను సైతం నెట్టింట్లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోలో షూటింగ్ స్పాట్ లో వేసిన టెంట్ .. కారవాన్లు .. ప్రొడక్షన్ వ్యాన్లు అక్కడ కనిపిస్తున్నాయి. చుట్టూ ఎత్తైన కొండలు .. పచ్చని ప్రకృతి .. నిండుగా ప్రవహిస్తున్న నదీ .. ఆ నదీ తీరాన సాంగ్ షూట్ చేయనున్నట్లుగా హింట్ ఇచ్చారు మేకర్స్. ఇందులో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్‏గా నటిస్తుండగా.. కీలక పాత్రలో ఫహద్ ఫాసిల్ నటిస్తున్నాడు. అలాగే యాంకర్ అనసూయ ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతుంది.

ట్వీట్..

Also Read: Sai Pallavi: నాగార్జున గురించి తాతయ్య చెప్పిన మాటలకు షాకయ్యాను.. ఆసక్తికర విషయాలను చెప్పిన సాయి పల్లవి..

Samantha: అవన్నీ పుకార్లే.. హైదరాబాదే నాకు ఇల్లు, అన్నీ ఇచ్చింది.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్