Allu Arjun: అట్లీ సినిమా కోసం సరికొత్త స్టైల్‌లో అల్లు అర్జున్.. రంగంలోకి ఎన్టీఆర్, మహేష్ బాబు ఫిట్‌నెస్ ట్రైనర్
అల్లు అర్జున్ తన కొత్త సినిమా కోసం ప్రముఖ ఫిట్ నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ను నియమంచుకున్నాడు. ఇప్పుడు వారిద్దరూ కలిసి ఉన్న ఫోటో వైరల్‌గా మారింది. లాయిడ్ స్టీవెన్స్ గతంలో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ మొదలైన హీరోలకు ఫిట్ నెస్ ట్రైనింగ్ ఇచ్చాడు.

అల్లు అర్జున్ సినిమాల కోసం తనను ఎలాగైనా మార్చుకుంటాడు. స్టైలిష్ గా కనిపించాలన్నా, ఊర మాస్ లుక్ లో కనిపించాలనుకున్నా పాత్రకు తగ్గుట్టుగా మారిపోతాడు. కేవలం టాలీవుడ్ లోనే కాదు దక్షిణాదిలోనూ సిక్స్ ప్యాక్ తో కనిపించిన తొలి హీరో బన్నీనే. ఇక తన నటనత ఏకంగా జాతీ ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్న తొలి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించాడు ఐకాన్ స్టార్. తాజాగా తన తర్వాతి సినిమా కోసం ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్‌ను నియమించుకున్నాడు అల్లు అర్జున్. లాయిడ్ స్టీవెన్స్ కు చాలా అనుభవం ఉంది. ఆయన గతంలో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ నటులకు శిక్షణ ఇచ్చారు. ‘RRR’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అంత పవర్ ఫుల్ గా కనిపించడానికి కారణం లాయిడ్ స్టీవెన్స్ శిక్షణ. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా లాయిడ్ స్టీవెన్స్ శిక్షణలో మరింత రాటుదేలనున్నాడు.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో ఓ సినిమా సిద్ధమవుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు అనుగుణంగా సినిమాను రూపొందించడానికి అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ మూడు పాత్రలు పోషించనున్నాడని సమాచారం. ఇందులో ఒకదాని కోసం అతను తన శరీరాకృతిని మార్చుకునే పనిలో ఉన్నాడు. ఈ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసమే ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్స్ స్టీవెన్‌ని నియమించుకున్నాడు బన్నీ. అల్లు అర్జున్ తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా లాయిడ్ స్టీవెన్స్ ఈ అప్‌డేట్ ఇచ్చారు. తన పోస్ట్ కు లోడింగ్, ట్రాన్స్ఫర్మేషన్ అనే హ్యాష్‌ట్యాగ్‌లను కూడా ఇచ్చారు. దీనిని చూసిన అభిమానులు థ్రిల్ అవుతున్నారు. అల్లు అర్జున్ ను కొత్త గెటప్ లో చూడాలనుకుంటున్నామని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
లాయిడ్ స్టీవెన్స్ తో అల్లు అర్జున్
#AlluArjun Undergoes Massive Body Transformation for #AA22
Celebrity trainer Lloyd Stevens drops a pic showcasing the stylish star’s intense prep🔥#AlluArjun #AA22 pic.twitter.com/3ZmufPzAWO
— Telugu Chitraalu (@TeluguChitraalu) May 3, 2025
అల్లు అర్జున్ మూడు పాత్రలు పోషించడం ఇదే తొలిసారి. కాబట్టి ఇది అతనికి సవాలుతో కూడుకున్నది. అలాగే, ‘పుష్ప 2’ విజయం తర్వాత చేపట్టిన సినిమా కాబట్టి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీని ప్రకారం, అతను తన అభిమానులను అలరించేందుకు జిమ్‌లో వర్కౌట్లు చేయడం ప్రారంభించాడు.
AA 22 అనౌన్స్ మెంట్ గ్లింప్స్..
Magic with mass & a world beyond imagination! #AA22
Teaming up with @Atlee_dir garu for something truly spectacular with the unparalleled support of @sunpictures pic.twitter.com/mTK01BVpfE
— Allu Arjun (@alluarjun) April 8, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








