Manasantha Nuvve : సినిమాలు వదిలేసి రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్.. ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే హీరోయిన్ గుర్తుందా.. ?
భారతీయ సినిమా పరిశ్రమలో చాలా మంది నటీమణులు దక్షిణ సినిమాలతో అరంగేట్రం చేస్తారన్న సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే నటిగా అందరి దృష్టిని ఆకర్షించి ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటారు. తక్కువ సమయంలోనే టాప్ స్థానంలోకి చేరుకుంటారు. తెలుగు తెలుగు పరిశ్రమతో తన ప్రయాణాన్ని ప్రారంభించి తమిళం, హిందీలో మెప్పించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?

దివంగత హీరో ఉదయ్ కిరణ్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఆయన సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఒకప్పుడు అందమైన ప్రేమకథతో హ్యాట్రిక్ హిట్టు కొట్టిన హీరో. ఉదయ్ కిరణ్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో మనసంతా నువ్వే ఒకటి. టాలీవుడి ఇండస్ట్రీలో ఇది ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ. ఇప్పటికీ, ఎప్పటికీ తెలుగు అడియన్స్ మదిలో నిలిచిన అందమైన ప్రేమకథ. డైరెక్టర్ వి.ఎన్ ఆదిత్య తెరకెక్కించిన ఈ సినిమా 2001లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ మూవీలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఆర్పీ పట్నాయక్ అందించిన మ్యూజిక్ అప్పట్లో యూత్‌ను ఆకట్టుకుంది. ఇక ఇందులో ఉదయ్ కిరణ్ సరసన రీమా సేన్ కథానాయికగా నటించింది. ఈ మూవీతో యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో తెలుగుతోపాటు తమిళం, హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంది.
2000లో బావ నచ్చాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రీమా సేన్. ఆ తర్వాత బాలీవుడ్ అరంగేట్రం 2001లో హమ్ హో గయే ఆప్కే అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత మనసంతా నువ్వే సినిమాతో హిట్టు అందుకున్న ఈ ముద్దుగుమ్మకు భారీగా ఆఫర్స్ వచ్చాయి. దీంతో తెలుగు, హిందీ, కన్నడ, బెంగాళీ, తమిళం భాషలలో వరుస ఆఫర్స్ అందుకుంది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. రీమా సేన్ నటించిన చిత్రాలు నెమ్మదిగా డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో ఆమెకు అవకాశాల తగ్గిపోయాయి. ఆ తర్వాత ఈ అమ్మడు ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యింది.
అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ ఆమె చివరి చిత్రం. 2012లో వ్యాపారవేత్త శివ కరణ్ సింగ్ ను వివాహం చేసుకుంది. వీరికి రుద్రవీర్ అనే బాబు ఉన్నారు. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటున్న రీమా సేన్.. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. అలాగే లాక్డౌన్ సమయంలో ఆమె రెస్టారెంట్ వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇప్పుడు రెస్టారెంట్ వ్యాపారంలోనే రాణిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోస్ షేర్ చేస్తుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..




