Pushpa 2: అరెరే.. ఈ సీన్స్ ఉంటే థియేటర్లలో విజిల్స్ పడేవి.. పుష్ప 2 డిలీట్ సీన్స్ చూశారా..?
పుష్ప ది రూల్.. ఇప్పుడు పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సినిమా. విడుదలైన ఆరు రోజుల్లోనే ఏకంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇందులో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ మాస్ నటవిశ్వరూపం చూసి ఫిదా అయ్యారు అడియన్స్. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా థియేటర్లలో దూసుకుపోతుంది. గత రెండు వారాలుగా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సౌత్, నార్త్ ఇండస్ట్రీలో రికార్డ్ కలెక్షన్లతో జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే రూ.1500 కోట్ల వసూళ్లకు చేరువగా ఉన్న ఈ సినిమాకు అన్ని వర్గాల అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రంలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఈ సినిమాలో నిడివి కారణంగా కొన్ని సీన్లను డిలీట్ చేసింది చిత్రయూనిట్. తాజాగా ఇప్పుడు ఆ సీన్లను యాడ్ చేసి టైటిల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇక ఆ వీడియో చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇంత మంచి సన్నివేశాలను ఎందుకు డిలీట్ చేశారు.. ? ఈ సీన్స్ సినిమాలో ఉంటే విజిల్స్ పడడం ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నిజానికి పుష్ప సినిమా రన్ టైమ్ గురించి గతంలోనూ చర్చలు జరిగాయి. సినిమా ఏకంగా మూడు గంటలకు పైగానే ఉండడంతో సినిమా స్టోరీ మీద సుకుమార్ డైరెక్షన్ పై నెట్టింట చర్చ జరిగింది. కానీ అడియన్స్ అంచనాలకు మించి థియేటర్లలో భారీ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది ఈ చిత్రం. అయితే ఈ సినిమాలో డిలీట్ చేసిన సీన్స్ అన్ని యాడ్ చేసి టైటిల్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అందులో పుష్ప తన చిన్నతనంలో ఎక్కడైతే క్రికెట్ ఆడనివ్వలేదో.. అక్కడే పిల్లలతో కలిసి క్రికెట్ టోర్నీని నిర్వహిస్తాడు పుష్ప. పిల్లలందరూ పుష్ప స్టయిల్, మేనరిజంతో స్టెప్పులు వేసే సీన్స్ యాడ్ చేశారు. ఈ సీన్స్ ఉంటే థియేటర్లలో విజిల్స్ పడేవి అంటున్నారు ఫ్యాన్స్.
ఇప్పటికే పుష్ప 2 సినిమా రన్ టైమ్ 3 గంటల 20 నిమిషాలు కావడంతో థియేటర్ వెర్షన్ లో ఆ సీన్స్ యాడ్ చేసే అవకాశం లేదు. దీంతో ఈ సీన్స్ డిలీట్ చేసి ఇప్పుడు ప్రత్యేకంగా టైటిల్ సాంగ్ విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రష్మిక మందన్నా, సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు కీలకపాత్రలు పోషించగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.
ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‌బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‌గా..
Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‌ను మించిన అందం.. ఎవరంటే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.