Meena Ganesh: నటి మీనా గణేష్ కన్నుమూత.. విషాదంలో సినీ పరిశ్రమ..
మలయాళీ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాపులర్ నటి మీనా గణేష్ కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించింది మీనా గణేష్.

పాపులర్ మలయాళ నటి మీనా గణేష్ కన్నుమూశారు. కొన్నిరోజులుగా వృద్ధప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె గురువారం ఒట్టప్పలంలో కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 81 సంవత్సరాలు. ఒట్టపాలెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కొన్నాళ్లుగా చికిత్స తీసుకుంటున్నారు మీనా గణేష్. గత ఐదు రోజులుగా చికిత్స తీసుకుంటున్న ఆమె ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. మలయాళ చిత్రపరిశ్రమలో 100కి పైగా సినిమాలు.. 25 సీరియల్స్, అనేక నాటకాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది మీనా గణేశ్. వాసంతి, లక్ష్మి, నామి, కారుమడికుట్టన్, నందనం, మీసామాధవన్ సినిమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యింది మీనా.
మీనా గణేష్ 1942లో పాలక్కాడ్‌లోని కల్లెకులంగరలో జన్మించారు. ఈమె తొలితరం తమిళ నటుడు కెపి కేశవన్ కుమార్తె. చదువుకునే రోజుల్లోనే నాటకాల్లో నటించడంతో ఆమెకు నటనపై ఆసక్తి పెరిగింది. కోయంబత్తూరు, ఈరోడ్, సేలంలోని మలయాళీ సంఘాలలో నటించి మెప్పించింది. 1976లో మణిముజక్కం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది మీనా గణేష్. 1991లో వచ్చిన ముఖచిత్రం సినిమా ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత సినిమాల్లో ఆఫర్స్ అందుకున్నారు.
1971లో సుప్రసిద్ధ నాటక రచయిత, దర్శకుడు మరియు నటుడు ఏఎన్ గణేష్‌ని వివాహం చేసుకుంది మీనా. వీరిద్దరు కలిసి పౌర్ణమి కళామందిర్ అని థియేటర్ కమిటీని సైతం ప్రారంభించారు. మలయాళంలో 100కు పైగా చిత్రాల్లో నటించిన మీనా కెరియర్ లో ఎన్నో చెప్పుకోదగ్గ పాత్రలు ఉన్నాయి. మీనా గణేష్ దంపతులకు కుమారుడు మనోజ్ గణేష్ సీరియల్స్ డైరెక్టర్, కూతురు సంగీత ఉన్నారు.
ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‌బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‌గా..
Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‌ను మించిన అందం.. ఎవరంటే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.