Samantha- Naga Chaitanya Divorce: సమంత చైతన్య విడాకుల పై నాగార్జున ఎమోషనల్ రియాక్షన్.. హృదయం బరువెక్కిందంటూ..
ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్కటే టాపిక్ .. సమంత - నాగచైతన్య విడాకులు. ఏడేళ్ల ప్రేమ బంధం నాలుగేళ్ల వివాహ బంధానికి తెగదెంపులు చేసుకున్నారు చైతన్య- సమంత.
Samantha- Naga Chaitanya: ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్కటే టాపిక్ .. సమంత – నాగచైతన్య విడాకులు. ఏడేళ్ల ప్రేమ బంధం నాలుగేళ్ల వివాహ బంధానికి తెగదెంపులు చేసుకున్నారు చైతన్య- సమంత. చై సామ్ విడిపోతున్నట్టు ప్రకటించారు.. నాగచైతన్య తన ట్విట్టర్ ద్వారా తెలుపగా.. సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వార్తను తెలిపింది. దాంతో అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు ఇలాంటి న్యూస్ వస్తుందంటే ఇండస్ట్రీ జనాలు కూడా నమ్మలేదు. దాదాపు చై సామ్‌ది దాదాపు 11 ఏళ్ల బంధం. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకున్నారు. ఒకరి మీద ఒకరి ప్రేమను ఎన్నో రకాలుగా చూపించారు. రీసెంట్‌గా సాకీ యానివర్సరీ సందర్భంగా మాట్లాడిన సామ్… అన్నీ రూమర్స్ అంటూ చెప్పటంతో డైవర్స్ న్యూస్ ఫాల్స్ అని ఫీల్ అయ్యారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు డైవర్స్ ఎనౌన్స్‌మెంట్‌తో షాక్ ఇచ్చారు సామ్.
చైతూ-సమంత.. విడిపోయారు. వారి మధ్య గ్యాప్ ఉందని, వేర్వేరుగా ఉంటున్నారని ఇన్నాళ్లు జరిగిన ప్రచారమే నిజమైంది. ఎంతో ఆలోచించి విడిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు ప్రకటించారు నాగచైతన్య. చైతన్య సమంత విడాకుల పై నాగార్జున స్పందించారు.. ‘బరువెక్కిన హృదయంతో ఈ విషయం చెప్తున్నాను.. సామ్-చై మధ్య జరిగినది చాలా దురదృష్టకరం. భార్య మరియు భర్త మధ్య జరిగేది చాలా వ్యక్తిగతమైనది. సామ్ మరియు చై ఇద్దరూ నాకు ప్రియమైనవారు, నా కుటుంబం ఎల్లప్పుడూ సామ్‌తో గడిపిన క్షణాలను ఎంతో ఆదరిస్తుంది మరియు ఆమె ఎల్లప్పుడూ మాకు ప్రియమైనది! దేవుడు వారిద్దరినీ శక్తితో దీవించుగాక అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు నాగార్జున.
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 2, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :