Samantha- Naga Chaitanya Divorce: సమంత -నాగచైతన్య విడాకుల పై వర్మ రియాక్షన్.. అంతమాట అనేశాడేంటి..!!
టాలీవుడ్‌లో మోస్ట్ రొమాంటిక్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న సమంత-నాగచైతన్య విడిపోయారన్న వార్త.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
Samantha- Naga Chaitanya Divorce: టాలీవుడ్‌లో మోస్ట్ రొమాంటిక్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న సమంత-నాగచైతన్య విడిపోయారన్న వార్త.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే అయినా.. అఫీషియల్ కన్ఫార్మేషన్‌తో ఫ్యాన్స్, ఇండస్ట్రీ జనాలు షాక్ అయ్యారు.దాదాపు చై సామ్‌ది దాదాపు 11 ఏళ్ల బంధం. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకున్నారు. నాగచైతన్య చేతి మీద సమంత పేరుతో టాటూ ఉంటే.. సమంత చేతి మీద నాగచైతన్య పేరుతో టాటూ ఉంది. కాని విడాకులకు ముందే తన చేతిపై ఉన్న టాటూను చెరిపేశాడు నాగచైతన్య. అప్పుడే ఇద్దరి మధ్య అనుబంధం తగ్గిందని ప్రపంచానికి తెలిసిపోయింది. సమంత కూడా తన పేరులో అక్కినేని పదాన్ని తొలగించడంతో మరింత క్లారిటీ వచ్చింది. మీడియాలో రకరకాల ఊహాగానాలు తెరపైకి రావడంతో అటు సమంత , ఇటు చైతూ చాలా ఇబ్బందులు పడ్డారు. చివరకు ట్విటర్‌లో ఇద్దరు విడాకులపై క్లారిటీ ఇవ్వడంతో సస్పెన్స్‌కు తెరపడింది.
ఇదిలా ఉంటే చైతన్య సామ్ విడిపోవడంతో అభిమానులంతా షాక్ లో ఉన్నారు. అయితే చైతన్య సామ్ విడాకుల పై వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్ లో స్పందించారు. ‘పెళ్లిళ్లు వద్దు.. విడాకులు సెలబ్రేట్ చేసుకోండి.. పెళ్లంటే చావు.. విడాకులంటే పునర్జన్మ ..’అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు వర్మ. అలాగే ఆయన గతంలో మాట్లాడిన ఓ ఇంటర్వ్యూని టాగ్ చేశారు. ఇప్పుడు ఆర్జీవీ పోస్ట్ వైరల్‌గా మారింది.
Not Marriages, Divorces should be celebrated..Marriage is death and Divorce is rebirth??? https://t.co/87HKdcAQ6L via @YouTube
— Ram Gopal Varma (@RGVzoomin) October 2, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :