Kondapolam Pre- Release Event : ‘కొండపొలం’ పాటల పండగ.. కర్నూల్‌లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్..
సినిమా అంటే ఎంటర్ టైన్ మెంట్ ఒకటే కాదు..! సినిమా అంటే జ్ఙానం. సినిమా ఓ మాధ్యమం.. సినిమా ఓ వాహకం. అవును మన జీవితాన్ని మనకు ప్రతిబింబిస్తుంది ఈ సినిమా..!
Kondapolam Pre- Release Event: సినిమా అంటే ఎంటర్ టైన్ మెంట్ ఒకటే కాదు..! సినిమా అంటే జ్ఙానం. సినిమా ఓ మాధ్యమం.. సినిమా ఓ వాహకం. అవును మన జీవితాన్ని మనకు ప్రతిబింబిస్తుంది ఈ సినిమా..! మన జీవన విధానాలను మన భవిషత్ తరాలకు అందిస్తుంది ఈ సినిమా..! మన ఆచార వ్యవహారాలను అందరికీ కంటికి ఇంపుగా చూపిస్తుంది ఈ సినిమా..! అయితే అలాంటి సినిమాలు ప్రస్తుతం రావడంలేదనేది అందరి వాదన. అలాంటి వాదనలను తెరదించుతూ.. తాజాగా మన ముందుకు వస్తున్న సినిమా ‘కొండపొలం’. కరోనా కష్టాలను అధిగమించి మరీ డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా ను తెరకెక్కించారు. నల్లమల్ల అడవీ ప్రాంతంలో.. రాయలసీమలో ఎక్కువగా షూట్ చేశారు. అయితే ఈ సినిమా అనౌన్స్ అయిన దగ్గరి నుంచే అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ఉప్పెన సినిమా బ్లాక్ బ్లస్టర్ హిట్ తరువాత పంజా వైష్ణవ్ తేజ్, నవల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుండడం.. ఓ విశేషమైతే.. క్రిష్ ఇలాంటి ఆఫ్ బీట్ నవలను ఎంచుకోవడం మరో విశేషం.
గొర్రె కాపరుల జీవితాలను.. వారి జీవనంలో భాగమైన ‘కొండపొలం’ విధానాన్ని.. ఆ విధానంలో మిలితమైన ఆచారా వ్యవహారాలను.. కష్ట సుఖాలను.. ఈ సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నారు క్రిష్. ఒక్కలైన్‌లో చెప్పాలంటే వనవాసానికి.. నగర వాసానికి..! గొర్రెలు కాయడానికి.. ఆధునిక సమాజంలో ఉద్యోగం సంపాదించడానికి..! కట్టుబాట్లలో బతకడానికి.. బతుకు బరిలో నిలబడడానికి.. మొత్తానికి పాత తరాల నుంచి అందరూ బతుకు పాఠాలు నేర్చుకోవాలని చెప్పేస్తుంది ఈ సినిమా ..! ఈ సినిమా నుంచి తాజాగా రిలీజైన శ్వాస సాంగ్ అందరినీ తన వైపుకు తిప్పుకుంటోంది. ‘ఈ మధ్య కాలంలో ఇలాంటి మెలోడీ సాంగ్ వినలేదనే నెటటిజన్ల కమెంట్లతో ఈ సాంగ్ యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌ను దక్కించుకుంటోంది. కీరవాణి స్వపరిచి.. సాహిత్యం అందించిన ఈ పాటను యామని ఘంటశాల, PVNS Rohit పాడారు. ఇక ఈ పాటలో.. గుండె లోయల్లో.. పొంగు వాగుల్లో… ప్రేమ సాగుల్లో.. బాగు వోగుల్లో అనే లైన్ అందరి హృదయాన్ని తాకుతోంది. అక్టోబర్ 8న రిలీజవుతున్న ఈ సినిమాను మరింతగా ప్రమోట్ చేసేందుకు.. రిమైనింగ్ సాంగ్స్‌ను రిలీజ్ చేసేందుకు కర్నూల్లో ఆడియో రిలీజ్ ఈవెంట్ను ప్లాన్ చేసింది ఈ మూవీ టీం. ఇక ఈ ఈవెంట్‌కు ఈసినిమా కాస్ట్ అండ్ క్రూతో పాటు మెగా అభిమానులు కూడా భారీగా విచ్చేస్తున్నారు.
కొండపోలం ప్రీరిలీజ్ ఈవెంట్ :
మరిన్ని ఇక్కడ చదవండి :