Chay-Sam: పరిచయం-ప్రేమ-పెళ్లి-ప్రయాణం-ముగింపు.. ఇదీ జరిగింది
టాలీవుడ్ స్క్రీన్ మీద మోస్ట్ రొమాంటిక్ కపుల్ నాగచైతన్య, సమంత. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు.

టాలీవుడ్ స్క్రీన్ మీద మోస్ట్ రొమాంటిక్ కపుల్ నాగచైతన్య, సమంత. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు. సినిమాను తలపించే కలర్ ఫుల్ లవ్ స్టోరీ చైతూ – సామ్‌ది. 2010లో తెలుగు ప్రేక్షకులను మాయ చేసే అందం వెండితెర మీద మెరిసింది. ఆ అందానికి ఆడియన్స్ మాత్రమే కాదు.. అక్కినేని కథానాయకుడు కూడా ఫిదా అయ్యాడు. తొలి సినిమాలో జెస్సీ ప్రేమ కోసం ఆమె వెంట పడ్డ చైతూ… రియల్ లైఫ్‌లో కూడా సమంత చేయి అందుకోవడానికి చాలా కష్టపడ్డాడు.
2015 నుంచి చై – సామ్‌ల ప్రేమ గురించి గుసగుసలు మొదలయ్యాయి. కొన్ని మూవీ షోస్‌కు ఇద్దరు కలిసిరావటం… చెన్నైలో పార్టీస్, ఫంక్షన్స్‌లో కలిసి కనిపించటంతో ఆ టాక్ మరింత ఎక్కువైంది. అదే టైమ్‌లో నాగ్ కూడా వీరి ప్రేమ గురించి ఓ హింట్ ఇచ్చారు. చైతూ తన పార్టనర్‌ను సెలెక్ట్ చేసుకున్నాడు అంటూ మీడియాకు లీకులిచ్చారు. గాసిప్స్‌కు ఫుల్ స్టాప్ పెడుతూ 2016 సెప్టెంబర్‌లో తమ రిలేషన్ షిప్ గురించి ఓపెన్ అయ్యారు సమంత. ప్రజెంట్ తాము లివిన్ రిలేషన్షిప్‌లోనే ఉన్నామని అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని కూడా కన్ఫార్మ్ చేశారు.
ఆ తరువాత కొద్ది రోజులకే అంటే 2016 డిసెంబర్‌లో చైతూతో కలిసి రొమాంటిక్ వెకేషన్‌కు వెళ్లారు సమంత. వారిద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో త్వరలోనే అక్కినేని ఇంట పెళ్లి భాజా మోగనుందని ఫిక్స్ అయ్యారు అభిమానులు. అనుకున్నట్టుగానే 2017 జనవరి 29 కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య చై సామ్‌ల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. అప్పుడే 2015 నుంచే తాము డేటింగ్‌లో ఉన్నామంటూ రివీల్ చేశారు ఈ క్యూట్ కపుల్. తమ ప్రేమ కథకు సంబంధించి రకరకాల సందర్బాల్లో చాలా విషయాలు రివీల్ చేస్తూ వచ్చారు.
2017 అక్టోబర్… టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ వెడ్డింగ్ ఈవెంట్. ఈ పెళ్లి వేడుక కోసం తెలుగు సినీ పరిశ్రమ అంతా గోవాకు తరలి వెళ్లింది. ముందు హిందూ సాంప్రదాయ పద్దతిలో, తరువాతి రోజు క్రిస్టియన్ పద్దతిలో రెండు వివాహాలు ఘనంగా జరిగాయి. సంగీత్, మోహందీ లాంటి సెలబ్రేషన్స్ నుంచి.. అప్పగింతల్లో సమంత కంటతడి పెట్టుకునే వరకు ప్రతీ ఒక్క సందర్భంగా ఇప్పటికీ అభిమానుల మనసులలో అలాగే పదిలంగా ఉండిపోయింది.
చైతూ మీద ఉన్న ప్రేమను ఎన్నో రకాలుగా చూపించారు సామ్.. సమంత ఒంటి మీద మూడు టాటూలు ఉన్నాయి. ఆ మూడు చైతూతో సంబంధం ఉన్నవే. తన జీవితా భాగస్వామిని తనకు చూపించిన ఏం మాయ చేసావే సినిమా పేరుకు షార్ట్ ఫామ్ YMC అనే అక్షరాలు తన మెడ వెనుక భాగంలో టాటూ వేయించుకున్నారు సామ్. చైతూ సామ్ ఇద్దరూ కుడిచేతి మణికట్టు భాగంలో యారో మార్క్స్‌ను ఒకే రకంగా టాటూ వేయించుకున్నారు, ఇవే కాదు సీక్రెట్ టాటూ అంటూ తన నడుము మీద ఉన్న చై సంతకాన్ని కూడా ఆ మధ్య చాలా అందంగా రివీల్ చేశారు సమంత.
అంటుకట్టినట్టు ఇంత అందంగా అతికిపోయిన ఈ జంట లైఫ్ జర్నీ… ఇప్పుడు విచిత్రంగా విడాకుల వైపు టర్న్ తీసుకుంది. చేతిలో చెయ్యేసి చెప్పుకున్న బాసలు ఊసులు ఇప్పుడు జస్ట్ ట్రాష్ అయిపోయాయి. చాలా లోతుగా మాట్లాడుకుని పరస్పర అవగాహనతో విడిపోతున్నాం… ఇక సమంత, నాగచైతన్య వేరువేరు అంటూ… సోషల్ మీడియాలో విడాకుల పత్రాన్ని పోస్ట్ చేశారు సమంత అండ్ చైతూ.
Also Read: విడాకుల ప్రకటన అనంతరం గుండె నిండా బాధతో సంచలన స్టేటస్ పెట్టిన సమంత