Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chay-Sam: ఆ ఇంట ఒదిగిపోయింది.. కానీ అనూహ్యంగా ఏమైంది..?

సమంత రూత్‌ ప్రభు... ఆ తర్వాత సమంత అక్కినేనిగా మారిపోయింది. 2017 అక్టోబర్ 7న జరిగిన ఈ మార్పును ఆమె మనసారా ఆహ్వానించింది.

Chay-Sam: ఆ ఇంట ఒదిగిపోయింది..  కానీ అనూహ్యంగా ఏమైంది..?
Sam Chay
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 02, 2021 | 5:04 PM

సమంత రూత్‌ ప్రభు… ఆ తర్వాత సమంత అక్కినేనిగా మారిపోయింది. 2017 అక్టోబర్ 7న జరిగిన ఈ మార్పును ఆమె మనసారా ఆహ్వానించింది. మనసంతా నువ్వే అంటూ చైతూతో మారిటల్ రిలేషన్‌ని ఎంజాయ్ చేసింది. టోటల్‌గా చై అండ్ సామ్… మేడ్ ఫర్ ఈచ్ అదర్… అనేది టాలీవుడ్‌లో ఒక లవ్‌లీ స్లోగన్‌గా మారిపోయింది. చైతూ తన మతం కాదు.. కానీ.. చైతూ అభిమతమే తన మతంగా మార్చుకుంది సమంత. తెలుగు మదర్‌కీ, మలయాళీ ఫాదర్‌కీ పుట్టిన సామ్… తనకు ఫలానా మతస్థుడే కావాలని ఎప్పుడూ అనుకోలేదు. అందుకే చైతూతో చివరిదాకా నడవాలన్న నిశ్చయం ఆమె మనసులో నాటుకుపోయింది. వాళ్లిద్దరి అన్యోన్యానికి ఆనవాళ్లు ఎన్నంటే బోలెడన్ని.

నాలుగేళ్ల పాటు పిల్లాపాపల్లేకపోయినా.. చైతూనే తన పిల్లాడుగా ఫీలయ్యేది సమంత. తను కట్టుకునే చీర మీదున్న డిజైన్‌ కూడా చైతూతో వైవాహిక బంధానికి రుజువు లాంటిది. ఒంటిమీది టూటూలు చెప్పేది కూడా చైతన్య మీద సమంతకున్న ప్రేమపాఠమే. నాలుగేళ్ల సమంత వైవాహిక జీవితం… అక్కినేని పరివారంతో ఆమె ఎంతగా కలిసిపోయిందో తెలియజెప్పింది. లాస్ట్ ఇయర్ దగ్గుబాటి వారింట జరిగిన రానా పెళ్లిలో సందడంతా సమంతాదే. అక్కినేని కుటుంబం తరఫున నేనే మెయిన్ రిప్రజెంటేటివ్‌ని అనే రేంజిలో కలివిడిగా కనిపించారు సమంత.

చైతూ సినిమాలు రిలీజైనప్పుడు డైరెక్ట్‌గానో, ఇన్‌డైరెక్ట్‌గానో ప్రమోషన్‌లో ముందుంటారు సమంత. ఆవిధంగా సహధర్మచారిణి అనే హోదాను పూర్తిస్థాయిలో ఫుల్‌ఫిల్ చేశారు సమంత. లాల్‌సింద్ చద్దా సినిమా షుూటింగ్‌ కోసం చై నార్త్ లో వుంటే.. సౌత్ నుంచి హాయ్ అంటూ తియ్యగా పలకరించారు సమంత. మామా అంటూ నాగార్జునకు ప్రేమపూర్వక పలకరింతలు దక్కాయి సమంత నుంచి. నాగ్-చై రిలేషన్ ఎంత థిక్కో ఓపెన్ డయాస్‌ మీద వాళ్లిద్దరి ముందే చెప్పేశారు నాగార్జున. కానీ ఈ రొమాంటిక్ కపుల్ విడాకుల నిర్ణయం మాత్రం ఫ్యాన్స్‌ను బాగా అప్‌సెట్ చేసింది.

Also Read: అవును.. వారిద్దరి నిర్ణయం వ్యక్తిగతమే.. ఫ్యాన్స్ హృదయాలు శోకసంద్రమే..

విడాకులకు ముందుగానే చేతిపై సామ్ టాటూను చెరిపివేసిన నాగ చైతన్య