AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha – Naga Chaithanya: అవును.. వారిద్దరి నిర్ణయం వ్యక్తిగతమే.. ఫ్యాన్స్ హృదయాలు శోకసంద్రమే..

నాలుగేళ్ల వివాహబంధాన్ని కలుపుకుని.. ఏకంగా పదేళ్ల స్నేహ బంధం వారిది. ప్రేమకు ప్రతిరూపంగా నిలిచిన చూడ చక్కని ముచ్చటైన జంట అది.. ఇంతలోనే ఏం జరిగిందో ఏమో.. ఇద్దరూ విడిపోవాలని షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.

Samantha - Naga Chaithanya: అవును.. వారిద్దరి నిర్ణయం వ్యక్తిగతమే.. ఫ్యాన్స్ హృదయాలు శోకసంద్రమే..
Samantha, Naga Chaithanya
Janardhan Veluru
|

Updated on: Oct 02, 2021 | 5:08 PM

Share

నాలుగేళ్ల వివాహబంధాన్ని కలుపుకుని.. ఏకంగా పదేళ్ల స్నేహ బంధం వారిది. ప్రేమకు ప్రతిరూపంగా నిలిచిన చూడ చక్కని ముచ్చటైన జంట అది.. వారిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీయే కాదు.. ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా అదరిందంటూ అభిమానులు ఎంతో మురిసిపోయారు.  ఇంతలోనే ఏం జరిగిందో ఏమో.. ఇద్దరూ విడిపోవాలని షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఎవరి దారిలో వారు విడివిడిగా ప్రయాణం మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు  సమంత, అక్కినేని నాగ చైతన్య సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇద్దరి మధ్య స్పెషల్ బాండ్ కొనసాగుతుందనీ స్పష్టంచేశారు. తమ ప్రైవసీని గౌరవించి తమకు అండగా నిలవాలంటూ అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియాకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఈ నెల (అక్టోబర్) 7వ తేదీతో వారి వివాహ బంధానికి నాలుగేళ్లు పూర్తికానుంది. మరో ఐదు రోజుల్లో నాలుగో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవాల్సిన వారు.. ఇక విడిపోవాలని నిర్ణయించుకోవడం అందరినీ నిరాశకు గురిచేస్తోంది.

సమంత, నాగ చౌతన్య ఇక విడిపోవాలని నిర్ణయం తీసుకోవడం వారి అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులను తీవ్ర నిరాశను మిగుల్చుతోంది. ఇటీవల చైతూ లేటెస్ట్ మూవీ లవ్ స్టోరీ ఫస్ట్ షో చూసి థియేటర్‌కు బయటకొచ్చిన ఓ వీరాభిమాని.. దయచేసి మీరిద్దరూ విడిపోకండి అంటూ చెయ్యెత్తి మొగ్గుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. వాస్తవానికి అతనొక్కడే కాదు.. ఎందరో అభిమానుల ఆకాంక్ష కూడా అదే. ఇద్దరూ కలిసి ప్రేమను గెలిపించాలని కోరుకున్నారు. అయితే వారి వివాహ బంధం బీటలు వారిందన్న వార్తను వారి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

సోషల్ మీడియా వేదికగా సమంత, నాగ చైతన్య విడాకుల నిర్ణయం పట్ల విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ప్రేమ ఓడిందంటూ గొల్లుమంటున్నారు. వారిద్దరి మధ్య అంతా సవ్వంగా లేదని మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతున్నా.. ఆ గాయాలను కాలం మాన్పుతుందని.. ఇద్దరూ కలిసి ప్రయాణం సాగిస్తారని ఆశించినట్లు చెబుతున్నారు. అయితే వేరు కుంపటి పెట్టుకోవాలన్న వారు నిర్ణయం తీసుకుంటారని ఊహించి కూడా చూడలేదంటున్నారు.

మీ ఇష్టాలు మాకు సమ్మతమే అంటూనే.. మాకు అన్నం తిన బుద్ధికావం లేదని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. ప్రేమ జంటలకు స్ఫూర్తిగా నిలవాల్సిన మీరు ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదంటున్నారు.

Also Read..

Akkineni : అక్కినేని ఫ్యామిలిలో స్క్రీన్‌ మీదకు వచ్చిన నటుల పెళ్లిళ్లు డిజాస్టర్లే.. వివరాలు ఇక్కడ

Naga Chaitanya – Samantha: విడాకులకు ముందుగానే చేతిపై సామ్ టాటూను చెరిపివేసిన నాగ చైతన్య