AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amala Akkineni: నాగార్జున పాటకు డాన్స్ అదరగొట్టిన అమల.. వైరలవుతున్న వీడియో…

పెళ్లికి ముందు పలు చిత్రాల్లో నటించిన అమల.. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. చాలా కాలం తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో మరోసారి వెండితెరపై కనిపించింది. 2012లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ మూవీ తర్వాత తెలుగులో కొన్ని చిత్రాల్లో అమ్మ పాత్రలు పోషించింది. ఇటు చిత్రాల్లో నటిస్తూనే అటు సామాజిక సేవలోనూ ముందుంటారు అమల. అయితే చాలా సంవత్సరాల తర్వాత నాగార్జున పాటకు డాన్స్ చేసి అదుర్స్ అనిపించారు.

Amala Akkineni: నాగార్జున పాటకు డాన్స్ అదరగొట్టిన అమల.. వైరలవుతున్న వీడియో...
Amala Akkineni
Rajitha Chanti
|

Updated on: Sep 12, 2023 | 7:44 PM

Share

దక్షిణాది సినీ పరిశ్రమలో మోస్ట్ బ్యూటీఫుల్ జోడి అంటే అక్కినేని నాగార్జున, అమల జంట గుర్తుకు వస్తుంది. శివ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడం.. ఆ తర్వాత పెళ్లితో వీరిద్దరు ఒక్కడవ్వడం తెలిసిందే. ఈ చిత్రంలో జత కట్టిన వీరిద్దరు నిజ జీవితంలోనూ జోడి అయ్యారు. పెళ్లికి ముందు పలు చిత్రాల్లో నటించిన అమల.. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. చాలా కాలం తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో మరోసారి వెండితెరపై కనిపించింది. 2012లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ మూవీ తర్వాత తెలుగులో కొన్ని చిత్రాల్లో అమ్మ పాత్రలు పోషించింది. ఇటు చిత్రాల్లో నటిస్తూనే అటు సామాజిక సేవలోనూ ముందుంటారు అమల. అయితే చాలా సంవత్సరాల తర్వాత నాగార్జున పాటకు డాన్స్ చేసి అదుర్స్ అనిపించారు.

ఇటీవల అన్నపూర్ణ ఫిల్మ్ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమానికి అమల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ నాగార్జున నటించిచన హలో బ్రదర్ సినిమాలోని ప్రియా రాగాలే పాటకు స్టేజ్ పై డాన్స్ చేశారు అమల. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతుంది. మీరు ఆ వీడియో పై ఓ లుక్కెయ్యండి.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ఈరోజు అక్కినేని అమల పుట్టినరోజు. అమల అసలు పేరు అమల ముఖర్జీ. ఆమె తల్లి ఐర్లాండ్ దేశస్తురాలు కాగా.. తండ్రి బెంగాళీ. అమల, నాగార్జున జోడిగా నటించిన తొలి చిత్రం కిరాయిదాదా. ఆ తర్వాత వీరి కాంబోలో వచ్చిన చిత్రం చినబాబు. ఆ తర్వాత శివ సినిమాలో కలిసి నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. తొలి సినిమాలో ఏర్పడిన పరిచయమే ఆ తర్వాత ప్రేమగా మారింది.

ఈరోజు అమల పుట్టిన రోజు సందర్భంగా తన తల్లితోపాటు నాగార్జున, అఖిల్ తో కలిసి దిగిన ఫోటోను ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసుకున్నారు అమల. పుట్టినరోజులు ప్రత్యేకమైనవి. అన్ని ప్రాంతాల నుంచి ప్రేమ వర్షం కురుస్తుంది. నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు అంటూ రాసుకొచ్చింది అమల.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్