Priya Prakash Warrier: సంగీత కచేరిలో ప్రియా ప్రకాష్ వారియర్.. గాన సరస్వతిలా ఉందంటూ..
ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో చిత్రంలో నటించింది ప్రియా. ఓవైపు సినిమాలో చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఈ కేరళ కుట్టి. గ్లామర్ ఫోటోలతో ఈ బ్యూటీ నెట్టింట చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. అయితే ఇప్పటివరకు కేవలం హీరోయిన్గా అలరించిన ప్రియకు మరో టాలెంట్ కూడా ఉంది. ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ వీడియో ఏంటీ అనేది చూద్దామా.

కన్నుకొట్టి సౌత్ అడియన్స్ హృదయాలను దొచేసింది హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్. ఒరు అదార్ లవ్ సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ తొలి చిత్రానికి సూపర్ హిట్ అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రియా చేసిన కన్నుకొట్టే సీన్ తెగ వైరలయ్యింది. దీంతో ఈ బ్యూటీకి పాన్ ఇండియా లెవల్లో పాపులారిటీ వచ్చేసింది. కానీ ఆ తర్వాత మాత్రం అంతగా ఆఫర్స్ మాత్రం రాలేదు. తెలుగుతోపాటు మలయాళంలో కొన్ని సినిమాల్లో నటించిన ప్రియ స్టార్ డమ్ మాత్రం అందుకోలేకపోయింది. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో చిత్రంలో నటించింది ప్రియా. ఓవైపు సినిమాలో చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఈ కేరళ కుట్టి. గ్లామర్ ఫోటోలతో ఈ బ్యూటీ నెట్టింట చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. అయితే ఇప్పటివరకు కేవలం హీరోయిన్గా అలరించిన ప్రియకు మరో టాలెంట్ కూడా ఉంది. ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ వీడియో ఏంటీ అనేది చూద్దామా.
ప్రియా గతంలో కచేరీకి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. 2018 చెంబై మ్యూజిక్ ఫెస్టివల్లో ప్రియా కచేరీ చేస్తూ కనిపించింది. అందులో ప్రియా ఎంతో మనోహరంగా .. అందంగా పాట పాడింది. ఈ వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. ఇది చూసిన నెటిజన్స్ ప్రియా అంత అందంగా పాట పాడగలదా ?.. ఎంతో సుమధురంగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
View this post on Instagram
చెంబై సంగీతోత్సవం అనేది గురువాయూర్ దేవస్వోమ్ వారు నిర్వహించే వార్షిక సంగీత ఉత్సవం. ఇది ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు చెంబై వైద్యనాథ్ భాగవత జ్ఞాపకార్థం జరుగుతుంది. ఏకాదశి సందర్భంగా చెంబై వైద్యనాథ్ భాగవతార్ ప్రారంభించిన సంగీతోత్సవం తర్వాత ఆయన పేరుతోనే ప్రాచుర్యం పొందింది. చెంబై భాగవతార్ తన శిష్యులతో కలిసి అర్థ శతాబ్ధం పాటు ఏకాదశి రోజున సంగీత విభావరి చేసేవారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ సంగీత కచేరి జరుగుతుంది. ఈ వేడుకలో అనేక మంది సంగీతకారులు పాల్గొంటారు.
ఇక ప్రియా సినిమాల విషయానికి వస్తే చివరిసారిగా ఘవా థిల్లర్ మూవీలో నటించింది. ఈ చిత్రానికి సూరజ్ వర్మ దర్శకత్వం వహించగా.. ఇందులో రజిషా విజయన్, వినయ్ ఫోర్ట్ ప్రధాన పాత్రలు పోషించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








