AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: టీమిండియా ఆటగాళ్లకు క్లాస్ పీకిన సూర్య.. పాక్‌తో మ్యాచ్‌కు ముందు అసలేం చెప్పాడో తెలుసా..?

Suryakumar Yadav Gives Strict No Sledging Message to Team: భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే మైదానంలో ఓ యుద్ధమే జరుగుతుంది. అటు అభిమానులపైనా సరే, ఇరు జట్ల ఆటగాళ్లైనా సరే.. మాటల యుద్ధాలు కూడా చోటు చేసుకుంటాయి. కానీ, టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మాత్రం ఈ విషయంలో ఆటగాళ్లకు కీలక సూచనలు చేశాడంట.

Video: టీమిండియా ఆటగాళ్లకు క్లాస్ పీకిన సూర్య.. పాక్‌తో మ్యాచ్‌కు ముందు అసలేం చెప్పాడో తెలుసా..?
Ind Vs Pak Suryakumar Yadav Video
Venkata Chari
|

Updated on: Feb 17, 2026 | 7:55 AM

Share

Suryakumar Yadav Gives Strict No Sledging Message to Team: టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్ స్టేజ్‌లో భాగంగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగింది. 2025 ఆసియా కప్ ఫైనల్ తర్వాత ఇరుజట్లు తొలిసారి తలపడడంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మ్యాచ్ లో సూర్యసేన ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, మైదానంలోకి దిగే ముందు టీమ్ హడిల్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆటగాళ్లకు కీలక సూచనలు ఇచ్చిన దృశ్యాలు కెమెరాల్లో చిక్కాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. అందుకు ఓ కారణం కూడా ఉంది. అదేంటో ఓసారి చూద్దాం..

భారత జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది. ఛేజింగ్ లో పాక్ జట్టు దారుణంగా విఫలమైంది. పవర్‌ప్లేలోనే పాకిస్తాన్ ఓపెనర్లు, టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చి భారత బౌలర్లు మ్యాచ్‌ను మొదట్లోనే తమ వైపుకు తిప్పుకున్నారు. హై వోల్టేజ్ పోరులో భావోద్వేగాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మైదానంలో మాటల తగాదాలు, బాహ్య ఉద్రిక్తతలు లేకుండా జట్టును కట్టుదిట్టంగా నియంత్రించాడు.

సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం అదుర్స్..

మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా సాహిబ్జాదా ఫర్హాన్ వికెట్ తీసిన తర్వాత ‘నో లుక్ సెలబ్రేషన్’ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొందరికి ఇది పాకిస్తాన్ ఆటగాళ్లను రెచ్చగొట్టే చర్యగా అనిపించినా, మైదానంలో రెండు జట్ల మధ్య ఎలాంటి గొడవలు చోటుచేసుకోలేదు.

భారత్, పాకిస్తాన్ మధ్య పోటీ నేపథ్యంలో ఫిబ్రవరి 1న పాకిస్తాన్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో భారత్ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసిన అంశం కూడా ఉద్రిక్తతను పెంచింది. అయితే ఐసీసీ, పీసీబీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య జరిగిన ఒప్పందంతో మ్యాచ్ తిరిగి షెడ్యూల్ అయ్యింది. ఈ మ్యాచ్‌కు సుమారు 174 మిలియన్ డాలర్ల ఆదాయం ఉందనే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

అయినా సరే, భారత ఆటగాళ్లు ‘స్పిరిట్ ఆఫ్ క్రికెట్’ను పాటిస్తూ మైదానంలో ప్రవర్తించిన తీరు ప్రశంసలు అందుకుంది.

మైదానంలో ‘ఎంగేజ్’ కావొద్దంటూ ఆటగాళ్లకు SKY సూచన..

టాస్ ఓడిపోయి భారత్ ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు టీమ్ హడిల్‌లో సూర్యకుమార్ యాదవ్ ఆటగాళ్లను ఉద్దేశించి స్పష్టమైన సందేశం ఇచ్చాడు. “ఓవర్ల మధ్య పరుగులు పెట్టుకుంటూ ఉండండి. ఎవరితో ఏం మాట్లాడొద్దు. ఎవ్వరితోనూ ఎంగేజ్ కావొద్దు. మనం మంచి క్రికెట్ ఆడాలి. మంచి స్కిల్‌తో ఈ మ్యాచ్ గెలుస్తాం” అని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.

ఈ మాటలు మైదానంలో జట్టు మనస్తత్వాన్ని స్పష్టంగా చూపించాయి. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులతో మెరిసిన సంగతి తెలిసిందే.

బ్యాట్, బంతితో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్..

మ్యాచ్ మొత్తం ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు లేకుండా ప్రశాంతంగా కొనసాగింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా రెండు జట్ల కెప్టెన్లు హ్యాండ్‌షేక్ చేసుకోలేదు.

సూర్యకుమార్ యాదవ్ 29 బంతుల్లో 32 పరుగులు చేయగా, రింకూ సింగ్, శివం దూబే చివర్లో కీలక పరుగులు జోడించడంతో భారత్ బలమైన స్కోరు సాధించింది.

లక్ష్య చేజ్‌లో ఉస్మాన్ ఖాన్ కొంత పోరాటం చేసినా, పాకిస్తాన్ అవసరమైన రన్‌రేట్‌ను అందుకోలేకపోయింది. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా తలో రెండు వికెట్లు తీసి పాకిస్తాన్‌ను కట్టడి చేశారు. నమీబియాతో ఫిబ్రవరి 18న జరిగే మ్యాచ్‌లో ఓడితే పాకిస్తాన్ సూపర్-8 దశకు చేరకుండా బయటపడే ప్రమాదంలో పడింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us