AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోయిన UAN నెంబర్ ఎలా తిరిగి పొందాలి, పీఎఫ్‌ ఖాతా నుంచి మనీ ఎలా విత్‌డ్రా చేయాలో తెలుసుకోండి!

పీఎఫ్‌ అకౌంట్ నుంచి డబ్బులు తీయాంటే మనకు UAN నెంబర్ అనేది చాలా అవసరం. అయితే చాలా మంది ఉద్యోగులు తమ UAN నంబర్‌ను మర్చిపోతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో తమ PF ఖాతాల నుండి డబ్బులు ఎలా తీసుకోవాలో అని టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ ఇకపై మీరు కంగారు పడాల్సిన పనిలేదు. ఎందుకంటే కొన్ని చిన్న స్టెప్స్ ద్వారా మీరు ఈజీగా మళ్లీ మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ను తిరిగి పొంవచ్చు. తద్వారా మీ అకౌంట్‌లో ఉన్న డబ్బును కూడా తీసుకొవచ్చు. అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం.

పోయిన UAN నెంబర్ ఎలా తిరిగి పొందాలి, పీఎఫ్‌ ఖాతా నుంచి మనీ ఎలా విత్‌డ్రా చేయాలో తెలుసుకోండి!
Forgotten Uan Retrieval
Anand T
|

Updated on: Feb 17, 2026 | 8:30 AM

Share

యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) అనేది EPFకి కంట్రిబ్యూట్ చేసే ప్రతి ఉద్యోగికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO ) కేటాయించిన సంఖ్య. ఇది ఒక ప్రత్యేకమైన 12-అంకెల సంఖ్య, ఒక ఉద్యోగి ఎన్ని ఉద్యోగాలు మారినా ఈ UAN నెంబర్ మాత్రమే అస్సలు మారదు. మీరు వేరే కంపెనీకి వెళ్లినప్పుడు ఈ నెంబర్ ద్వారా ఈజీగా మీ పీఎఫ్‌ అకౌంట్‌ను మెర్జ్ చేసుకోవచ్చు. ఇలా మెర్జు చేసుకున్న తర్వాత మీరు మీ బ్యాలెన్స్‌ను చెక్‌ చేయడానికి, మీ పాస్‌బుక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి, మీ KYC వివరాలను అప్‌డేట్‌ చేసుకోవడానికి ఈ నెంబర్ ఉపయోగపడుతుంది. అయితే మీరు దీన్ని మర్చిపోతే తిరిగి ఎలా పొందాలో చూద్దాం.

UAN నంబర్‌ను ఎలా తిరిగి పొందాలి?

  • మీరు మీ UAN నంబర్‌ను మర్చిపోతే, దానిని తిరిగి పొందడానికి మీరు EPFO ​​సభ్యుల e-Seva పోర్టల్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
  • ఇందుకోసం మీరు ముందుగా, EPFO వెబ్‌సైట్‌ వెళ్లి ముఖ్యమైన లింక్‌ల కింద ‘మీ UAN గురించి తెలుసుకోండి’ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  • ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి క్యాప్చాను ఎంటర్ చేయండి.
  • తర్వాత మీ మొబైల్ ఫోన్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేయండి.
  • ఇప్పుడు మీ పేరు, పుట్టిన తేదీ, పాన్/ఆధార్/మీ ఐడిని ఎంటర్ చేయండి.
  • తర్వాత మీకు ‘షో మై UAN’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
  • అప్పుడు మీకు మీ UAN కనిపిస్తుంది.

UMANG యాప్ ద్వారా UAN నెంబర్ తెలుసుకోవడం ఎలా?

ఇవి కూడా చదవండి
  • మీరు UMANG యాప్ ద్వారా కూడా UAN ను తెలుసుకోవచ్చు.
  • UMANG యాప్ లేదా SMS ఉపయోగించి మీరు మర్చిపోయిన UAN ను ఎలా తిరిగి పొందవచ్చు.
  • ఇందుకోసం మీరు ప్లే స్టోర్ నుంచి UMANG యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొండి.
  • దాన్ని ఇన్‌స్టాల్ చేసి మీ మొబైల్ నెంబర్‌తో రిజిస్టర్ అవ్వండి
  • తర్వాత యాప్ ఓపెన్ చేసి EPFO ​​సర్వీసెస్‌కి వెళ్లండి
  • అక్కడ మీ UAN గురించి తెలుసుకోండి’ అనే ఆప్షన్‌ను ఎంచుకొండి.
  • అప్పుడు మీకుOTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేయండి.
  • మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 7738299899 (EPFOHO UAN KYA) కు SMS చేయండి
  • కాసేపటి తర్వాత మీ మొబైల్‌కు UAN నెంబర్ మెసేజ్‌కు వస్తుంది.

EPFO పోర్టల్ నుండి PF డబ్బును ఎలా ఉపసంహరించుకోవాలి?

  • పీఎఫ్‌ ఖాతా నుంచి మీరు మీ డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు మీరు EPFO పోర్టల్‌కి వెళ్లాలి.
  • EPFO పోర్టల్‌ వెళ్లి మీ UAN, పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి.
  • తర్వాత Manage పై క్లిక్ చేసి KYC సెక్షన్‌లో వెళ్లి Aadhaar, PAN, Bank వివరాలు కరెక్ట్‌గా ఉన్నాయో చూడండి. అవసరమైతే అప్‌డేట్ చేయండి
  • తర్వాత ‘ఆన్‌లైన్ సర్వీసెస్’ ట్యాబ్ కింద ‘క్లెయిమ్ (ఫారమ్-31, 19, 10C, 10D)’ పై క్లిక్ చేయండి
  • మీ గుర్తింపును ధృవీకరించడానికి UAN తో లింక్ చేయబడిన మీ బ్యాంక్ ఖాతా నంబర్ లాస్ట్ 4 అంకెలను ఎంటర్ చేసి, Verify పై క్లిక్ చేయండి.
  • తర్వాత Undertaking/Declaration టిక్ చేసి Proceed for Online Claim క్లిక్ చేయండి.
  • తర్వాత కింద క్లెయిమ్ రకాన్ని ఎంచుకోండి
  • PF Advance (Form 31) → మీరు ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్నట్లయితే పాక్షిక ఉపసంహరణ ఈ ఫామ్‌ను సెలెక్ట్ చేయండి.
  • Only PF Withdrawal (Form 19) ఒక వేళ మీరు ఉద్యోగం మానేసి పూర్తి PFను విత్‌డ్రా చేసుకోవాలని అనుకుంటే ఈ పామ్‌పై క్లిక్ చేయండి.
  • PF Pension Withdrawal (Form 10C) మీరు పెన్షన్ బెనిఫిట్ పొందాలి అనుకుంటే ఈ ఫామ్‌ను ఎంచుకోండి.
  • తర్వాత మీరు ఎందుకు డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారో కారణంపై సెలెక్ట్ చేయండి.
  • తర్వాత Aadhaar లింక్ మొబైల్‌కి వచ్చే OTP ఎంటర్ చేసి, క్లెయిమ్‌ను సబ్‌మిట్ చేయండి.
  • అంతే ఇక 4-6 రోజుల్లో మీ పీఎఫ్‌ అకౌంట్‌కు లింక్‌ అయి ఉన్న అకౌంట్‌లోకి అమౌంట్ యాడ్ అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us