AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1,370 గంటల కష్టం ఈ డ్రెస్.. గ్లాస్ బీడ్స్, క్రిస్టల్స్ పొదిగిన డ్రెస్‌లో మెరిసిన అలియా భట్

ఆ స్టార్​ హీరోయిన్​ ఒకవైపు పవర్ హౌస్ పెర్ఫార్మర్ మరోవైపు గ్లోబల్ ఫ్యాషన్ ఐకాన్. ఆమె వేసుకునే దుస్తులు ఎప్పుడూ ట్రెండ్ సెట్ చేస్తుంటాయి. తాజాగా ఆ బ్యూటీ ఒక నల్లటి వెల్వెట్ కార్సెట్ గౌన్ లో మెరిసిపోయింది. ఆ గౌన్ మీద ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్ చూస్తే ఎవరికైనా కళ్లు చెదరాల్సిందే.

1,370 గంటల కష్టం ఈ డ్రెస్.. గ్లాస్ బీడ్స్, క్రిస్టల్స్ పొదిగిన డ్రెస్‌లో మెరిసిన అలియా భట్
Alia Bhatt..
Nikhil
|

Updated on: Feb 17, 2026 | 6:00 AM

Share

ఈ డ్రెస్ తయారు చేయడానికి కళాకారులు పగలు రాత్రి కష్టపడ్డారు. అంతర్జాతీయ నటీమణులు జెండయా, గిగి హడిద్ వంటి వారు మెచ్చే ఆ ప్రముఖ డిజైనర్ చేతుల్లో ఈ డ్రెస్ రూపుదిద్దుకుంది. ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు.. అలియా భట్. రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన ఈ అద్భుతమైన డ్రెస్ విశేషాలేంటో చూద్దాం..

1,370 గంటల శ్రమ..

నోయిడాలోని తన అటెలియర్‌లో డిజైనర్ రాహుల్ మిశ్రా ఈ డ్రెస్ ను ప్రత్యేకంగా రూపొందించారు. దీనిని తయారు చేయడానికి ఏకంగా 1,370 గంటల సమయం పట్టింది. అంటే దాదాపు రెండు నెలల పాటు కళాకారులు దీనిపై పనిచేశారు. గ్లాస్ బుగ్ల్ బీడ్స్, క్రిస్టల్ బీడ్స్, సీక్విన్స్ తో పాటు క్లిష్టమైన త్రెడ్ ఎంబ్రాయిడరీని ఇందులో వాడారు. స్ప్రింగ్ 2025 కోచర్ కలెక్షన్ లోని ‘సిటీ స్కేప్’ లైన్ నుండి ఈ పీస్ ను అలియా ఎంచుకుంది. రాహుల్ మిశ్రా ఈ కలెక్షన్ కు “ది పేల్ బ్లూ డాట్” అని పేరు పెట్టారు.

ఇది కేవలం అందంగా కనిపించడానికి మాత్రమే కాదు, నేటి నగరాల్లో పెరుగుతున్న కాలుష్యం, మానవ నిర్మిత వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడానికి రూపొందించబడింది. “ఒకవేళ మన నగరాలు దెయ్యాల పట్టణాలుగా మారిపోతే పరిస్థితి ఏంటి?” అనే ప్రశ్నను ఆయన ఈ డిజైన్ల ద్వారా ప్రపంచాన్ని అడిగారు. భూమి, జీవితం, సుస్థిరత వంటి అంశాలను దుస్తుల ద్వారా ప్రతిబింబించడం ఒక సవాలుతో కూడిన పని అని ఆయన అభిప్రాయపడ్డారు.

రాహుల్ మిశ్రా డిజైన్లకు అంతర్జాతీయంగా భారీ క్రేజ్ ఉంది. గతంలో హాలీవుడ్ నటీమణులు జెండయా, సెలీనా గోమెజ్, గిగి హడిద్ వంటి వారు కూడా ఆయన దుస్తుల్లో మెరిశారు. అలియా భట్ ఈ గౌన్‌కు జతగా డైమండ్ నెక్లెస్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ధరించింది. ప్రియాంక కపాడియా స్టైలింగ్ లో అలియా తన జుట్టును లూజ్ గా వదిలేసి, మేకప్ చాలా సింపుల్ గా ఉంచుకుంది.

దీనివల్ల ఆమె డ్రెస్ మీద ఉన్న ఆ అద్భుతమైన పనితనం మరింత హైలైట్ అయ్యింది. అలియా భట్ కేవలం గ్లామర్ కు మాత్రమే కాకుండా, అర్థవంతమైన ఫ్యాషన్ కు కూడా ప్రాధాన్యత ఇస్తుందని ఈ డ్రెస్ తో మరోసారి నిరూపితమైంది. కళాకారుల కష్టానికి, డిజైనర్ ఆలోచనకు అద్దం పట్టిన ఈ ‘సిటీ స్కేప్’ గౌన్ లో అలియా ఒక దేవతలా మెరిసిపోయింది.

Follow Us