AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bean Board Robo: అడిగిన వెంటనే అద్భుతమైన కాఫీ ఇచ్చే రోబో.. టేస్ట్ చూస్తే మతిపోవాల్సిందే!

మీకు వేడివేడి కాఫీ కావాలా?! అది కూడా మీకు నచ్చించి క్షణాల్లో మీ చేతిలో ఉండాలా! అయితే ఇది మీ కోసమే.. మీరు అడిగిన కాఫీని క్షణాల్లో అందించే ఓ రోబో ఇప్పుడు విశాఖలో సిద్ధంగా ఉంది. మీరు మెచ్చిన కాఫీ నచ్చినట్టు తయారు చేసి మీకు స్వయంగా సర్వ్ చేస్తుంది ఆ రోబో. నగరంలోని మిలన్ విలేజ్ లో ఉన్న ఈ రోబో ప్రస్తుం స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది.

Bean Board Robo: అడిగిన వెంటనే అద్భుతమైన కాఫీ ఇచ్చే రోబో.. టేస్ట్ చూస్తే మతిపోవాల్సిందే!
Bean Board Coffee Robot
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Feb 17, 2026 | 12:03 AM

Share

ఇంటర్నేషనల్ ఫ్లిట్ రివ్యూ, మిలన్ సందర్భంగా తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో మిలన్ విలేజ్ ప్రారంభమైంది. నావల్ బేస్ లోని సముద్రిక ఆడిటోరియం వద్ద మిలాన్ విలేజ్ ఏర్పాటు చేశారు. నావికాదళ చిహ్నాలు, హస్త కళలు, చేనేత, ఆహార ఉత్పత్తులు లాంటి వివిధ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన ఓ రోబో కాఫీ స్టాల్ నౌకాదళ అధికారులు, సిబ్బందిని ఆకట్టుకుంది. ఇక్కడ కాపీ అందించే దాని పేరు బీన్ బోర్డు రోబో. డబ్బులు చెల్లించి నచ్చిన కాఫీ మీద నొక్కితే.. క్షణాల్లో ఆ రోబో మీకు రుచికరమైన కాఫీ చేసి పెడుతుంది. మనుషుల సహాయం లేకుండానే ఓ కప్పును తీసుకుని.. పక్కనే మెషిన్ కింద పెడుతుంది. రోబో సెన్సార్లతో అనుసంధానమైన మెషిన్.. కాఫీ సిద్ధం చేస్తుంది. తయారైన కాఫీని ఆ కప్పులో పట్టి ఆ రోబో స్వయంగా చేతితో అందిస్తుంది.

ఆరు రకాల కాఫీ, టీ..!

ఈ బీన్ బోర్డ్ రోబో.. నాలుగు రకాల కాఫీలు, రెండు రకాల టీలను సిద్ధం చేస్తుంది. కాఫీల్లో కేపు చినో, లాటే, ఎస్ప్రెస్సో, అమెరికానో (బ్లాక్ కాఫీ) కూడా మీకు వేడి వేడిగా మీ కళ్ళ ముందే మేక్ చేసి మీకు అందిస్తుంది. అలాగే మరో రెండు వెరైటీల ఐస్ టీ లను కూడా తయారు చేస్తుంది ఈ రోబో. దీంతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ రోబోను చూసి ఆశ్చర్యపోయారు. అది పెట్టి ఇచ్చిన కాఫీ తాగి కాంప్లీమెంట్స్ కూడా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

అయితే త్వరలో ఇలాంటి రోబోలను ఎయిర్ పోర్ట్స్ లలో ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని బీన్ బోర్డు ప్రతినిధి ఐజాక్ జెరిమయ తెలిపారు. దిల్లీ, హైదరాబాద్ ఎయిర్ పోర్ట్స్ లో వీటని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రష్యా నుంచి స్పేర్స్ పార్ట్స్ తీసుకొచ్చి తామే తమకు తగ్గట్టుగా ఈ కాఫీ రోబోను ఇన్‌స్టాల్ చేస్తున్నామని ఆయన తెలిపారు. విశాఖ నుంచి ఏషియా, యూరోపియన్ కంట్రీస్ కి కాఫీ రోబో స్ ను సప్లై చేసేలా కార్యచరణ సిద్ధం చేస్తున్నామన్నారు.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పాల మీగడతో అసలైన ఆవు నెయ్యిను ఈజీగా ఎలా తయారు చేయొచ్చో తెల్సా..
పాల మీగడతో అసలైన ఆవు నెయ్యిను ఈజీగా ఎలా తయారు చేయొచ్చో తెల్సా..
హత్య చేసి ఇంట్లో పాతి పెట్టాడు.. దెయ్యం వెంటాడుతోందంటూ!
హత్య చేసి ఇంట్లో పాతి పెట్టాడు.. దెయ్యం వెంటాడుతోందంటూ!
వాహనదారులకు షాక్‌.. పెరిగిన సీఎన్‌జీ ధరలు.. కేజీకి ఎంతంటే..
వాహనదారులకు షాక్‌.. పెరిగిన సీఎన్‌జీ ధరలు.. కేజీకి ఎంతంటే..
కెప్టెన్లను కాదని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కొట్టేసిన కుర్రాడు
కెప్టెన్లను కాదని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కొట్టేసిన కుర్రాడు
ఓరీ దేవుడో.. కొబ్బరి నీళ్లను కూడా వదలని కంత్రీగాళ్లు.. ఎలా కల్తీ
ఓరీ దేవుడో.. కొబ్బరి నీళ్లను కూడా వదలని కంత్రీగాళ్లు.. ఎలా కల్తీ
దేశవ్యాప్తంగా భారీ విధ్వంసానికి కుట్ర..!
దేశవ్యాప్తంగా భారీ విధ్వంసానికి కుట్ర..!
ఒక్క టూత్‌పిక్ చాలు.. వేళ్లకు నొప్పి లేకుండా వెల్లుల్లి పొట్టును
ఒక్క టూత్‌పిక్ చాలు.. వేళ్లకు నొప్పి లేకుండా వెల్లుల్లి పొట్టును
ఇక మెట్రోలో ఇలా చేస్తే రూ.5000 జరిమానా.. చట్టంలో మార్పు!
ఇక మెట్రోలో ఇలా చేస్తే రూ.5000 జరిమానా.. చట్టంలో మార్పు!
పూరికి అతడంటే పిచ్చి ఇష్టం.. భయంకరంగా ఏడ్చాడు..
పూరికి అతడంటే పిచ్చి ఇష్టం.. భయంకరంగా ఏడ్చాడు..
జనాల కంటపడిన వింత పక్షి.. అందంగా కనిపించే ఈ జీవి గురించి తెలిస్తే
జనాల కంటపడిన వింత పక్షి.. అందంగా కనిపించే ఈ జీవి గురించి తెలిస్తే