AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tabu: ‘మగాడు కేవలం దాని కోసమే’.. టబు బోల్డ్ కామెంట్స్‌పై దుమారం.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన నటి

ప్రముఖ బాలీవుడ్ నటి టబు తన వివాహం, వ్యక్తిగత జీవితం గురించి చేసిన తప్పుడు ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ తప్పుడు వార్తలపై టబు బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. తానెప్పుడూ అలాంటి ప్రకటన చేయలేదని టబు స్పష్టం చేసింది. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం ఆపేయాలని ఆమె రిక్వెస్ట్ చేసింది.

Tabu: 'మగాడు కేవలం దాని కోసమే'.. టబు బోల్డ్ కామెంట్స్‌పై దుమారం.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన నటి
Actress Tabu
Basha Shek
|

Updated on: Jan 24, 2025 | 6:35 AM

Share

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో టబు ఒకరు. తొంభైలలో తన సినిమా కెరీర్ ప్రారంభించిందీ అందాల తార. హిందీతో పాటు దక్షిణాదిలోనూ పలు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. గ్లామరస్ రోల్స్ తో పాటు వైవిధ్యమైన పాత్రలు పోషించింది. కాగా తన సినిమాలతో పాటు, టబు తన వ్యక్తిగత జీవితంతో తరచుగా వార్తల్లో నిలుస్తుంది. 53 ఏళ్ల ఈ అందాల తార ఇప్పటికీ ఒంటరిగానే ఉంది. అందుకే ఎక్కడకు వెళ్లినా పెళ్లి,రిలేషన్ షిప్ వంటి ప్రశ్నలు టబుకు ఎదురవుతుంటాయి. అలా తాజాగా ఒక ఇంటర్వ్యూలో వివాహం గురించి ప్రశ్నకు టబు ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మగాడు కేవలం బెడ్‌ మీదకే మాత్రమే పనికొస్తాడని టబు ఓ ఇంటర్వ్యూలో చెప్పిందని సామాజిక మాధ్యమాలతో పాటు వెబ్ సైట్లలో కథనాలు దర్శనమిచ్చాయి. ఇలా బోల్డ్ కామెంట్స్ చేయడంపై కొందరు ఆమెను విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో టబుపై వస్తున్న వార్తలపై ఆమె టీమ్ ఘాటుగానే స్పందించింది. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఇందులో టబు ఎప్పుడూ అలాంటి ప్రకటన చేయలేదని ఆమె టీమ్ స్పష్టం చేసింది.

‘ఇంటర్వ్యూలు, ప్రోగ్రామ్స్‌లో నేనెప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు’ అని టబు తన ప్రకటనలో స్పష్టం చేసింది. ‘పలు వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ టబు పేరుతో కొన్ని అవమానకరమైన, అసభ్యకరమైన తప్పుడు ప్రకటనలు చేస్తున్నాయి. ఆమె ఎప్పుడూ అలాంటి ప్రకటన చేయలేదని మేం స్పష్టం చేయాలనుకుంటున్నాము.అభిమానులను తప్పుదారి పట్టించడం తీవ్రమైన ఉల్లంఘన. ఈ వెబ్‌సైట్‌లు తక్షణమే ఈ తప్పుడు ప్రకటనలను తొలగించాలి. ఇందుకు గానూ అధికారికంగా క్షమాపణలు చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం’ అని టబు బృందం తెలిపింది.

25 ఏళ్ల తర్వాత

‘నాకు పెళ్లిపై ఆసక్తి లేదు. నా బెడ్‌పై ఒక మగాడు మాత్రమే కావాలి’ అని టబు చెప్పినట్లు ప్రచారం జరుగుతోది. ఎవరో కావాలనే ఇలా చేశారని అంటున్నారు. టబు ప్రస్తుతం అక్షయ్ కుమార్‌తో కలిసి ‘భూత్ బంగ్లా’ షూటింగ్‌లో బిజీగా ఉంది. అక్షయ్, టబుతో పాటు పరేష్ రావల్ కూడా కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత అక్షయ్‌కుమార్‌, టబు కలిసి నటిస్తున్న చిత్రమిది. ఇంతకుముందు వీరిద్దరూ ‘హేరా పేరి’లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!