Shruthi Haasan: ఆ స్టార్ హీరో సినిమా సెట్లో శ్రుతి హాసన్ సందడి.. మోస్ట్ టాలెంటెడ్ అంటూ డైరెక్టర్ ట్వీట్…
తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అగ్రకథానాయికగా దూసుకుపోతుంది. మరోవైపు కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలోనూ సత్తా చాటింది శ్రుతి..

విశ్వనటుడు కమల్ హాసన్ వారసురాలిగా చిత్రపరిశ్రమలోకి కథానాయికగా అరంగేట్రం చేసి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ శ్రుతి హాసన్ (Shruthi Haasan). తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అగ్రకథానాయికగా దూసుకుపోతుంది. మరోవైపు కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలోనూ సత్తా చాటింది శ్రుతి.. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల రవితేజ సరసన క్రాక్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో మళ్లీ ఫాంలోకి వచ్చేసింది ఈ ముద్దుగుమ్మ..ప్రస్తుతం బాలయ్య, మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉండిపోయింది.. తాజాగా ఈ అమ్మడు ఓ స్టార్ హీరో సినిమా షూటింగ్ సెట్లో సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోను డైరెక్టర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతుంది.. ఇంతకీ ఎవరా హీరో ?.. ఏ సినిమా ? తెలుసుకుందామా..
నందమూరి నటసింహం బాలయ్య ఇటీవల అఖండ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. #NBK 107 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌తో అంచనాలను అమాంతం పెంచేసింది చిత్రయూనిట్.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యింది. ఈ విషయాన్ని డైరెక్టర్ గోపిచంద్ మలినేని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు.. మోస్ట్ టాలెంటెడ్ ఫెవరేట్ పర్సన్ శ్రుతి హాసన్ సెట్లో ఉంది అంటూ ఆమెతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు.




Most talented n favourite @shrutihaasan on sets #NBK107????? pic.twitter.com/iSdmX4zrn9
— Gopichandh Malineni (@megopichand) June 18, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
