Suman: ఓటీటీ, వెబ్ సిరీస్‏లపై సెన్సార్ బోర్డ్ ఫోకస్ చేయాలి.. సుమన్ షాకింగ్ కామెంట్స్..

వెబ్ సిరీస్, సీరియల్లలో వచ్చే కంటెంట్‏లో అశ్లీలత ఎక్కువగా ఉంటుందని..ప్రస్తుతం ఓటీటీల ప్రభావం ఎక్కువగా ఉందన్నారు..

Suman: ఓటీటీ, వెబ్ సిరీస్‏లపై సెన్సార్ బోర్డ్ ఫోకస్ చేయాలి.. సుమన్ షాకింగ్ కామెంట్స్..
Suman
Follow us

|

Updated on: Jun 19, 2022 | 8:48 AM

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్, సినిమాలపై సెన్సార్ బోర్డు దృష్టి పెట్టాల్సిన అవసరముందన్నారు సీనియర్ నటుడు సుమన్ (Suman). వెబ్ సిరీస్, సీరియల్లలో వచ్చే కంటెంట్‏లో అశ్లీలత ఎక్కువగా ఉంటుందని..ప్రస్తుతం ఓటీటీల ప్రభావం ఎక్కువగా ఉందన్నారు.. విజయవాడ గ్రామీణ మండలం పి. నైనవరంలో సుమన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆలిండియా అధ్యక్షుడు ధఊళిపాళ్ల దేవేంద్ర భార్య నిర్మల మొదటి వర్ధంతి కార్యక్రమానికి సుమన్ హాజరయ్యారు.. అనంతరం విలేకరులతో ముచ్చుటించారు.. కరోనా సంక్షోభంతో గత రెండేళ్లుగా ఓటీటీల ప్రభావం పెరిగిందని.. అందులో వచ్చే వెబ్ సిరీస్, బుల్లితెరపై వచ్చే సీరియళ్లలో అశ్లీలత ఎక్కువగా ఉంటుందని.. దీనిపై ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడం ప్రధాన కారణమన్నారు..ప్రభుత్వం, సెన్సార్ బోర్డ్ ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్, సీరియల్స్ పై దృష్టి పెట్టాలన్నారు.

చిన్న పిల్లలు ఫోన్లలో సిరీస్ చూసి ఆ ప్రభావానికి లోనవుతున్నారన.. బుల్లితెరపై సినిమాలకు, ఓటీటీ వెబ్ సిరీస్ లకు సెన్సార్ బోర్డ్ నిబంధనలు ఒకేలా ఉంటే బాగుంటుందన్నారు. ప్రస్తుత కాలంలో షార్ట్స్ ఫిల్మ్స్ చూసేవారి సంఖ్య పెరిగిపోయిందని.. నిర్మాతలు సైతం వాటిపై ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. అలాగే తాను ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో లేనని.. సీఎం జగన్ ను కలిసేందుకు రెండు మూడు సార్లు ప్రయత్నించినప్పటికీ.. అపాయింట్మెంట్ దొరకలేదన్నారు. ప్రజలకు అందుబాటులో వారి కష్టాలను చూసేవారికే ఓట్లు వేస్తారన్నారు.. మెచ్యూరిటీ లేనివారిని ప్రజలు ఆదరించలేరని అభిప్రాయం వ్యక్తం చేశారు సుమన్..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.