Tollywood: ‘మళ్లీ అమ్మను కాబోతున్నా’.. శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
గతంలో పలు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించిన ప్రముఖ హీరోయిన్ శుభవార్త చెప్పంది. త్వరలోనే తాను మరోసారి తల్లిగా ప్రమోషన్ పొందనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ మేరకు బేబీ బంప్ తో ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. దీంతో ఈ అందాల తారకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ అమ్మడు పలు తెలుగు సినిమాల్లోనూ నటించింది. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, పవన్ కల్యాణ్, తరుణ్, రాజ శేఖర్, శ్రీకాంత్, సాయిరాం శంకర్ తదితర హీరోల సినిమాల్లో నటించింది. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా, మరికొన్ని సినిమాల్లో సెకెండ్ హీరోయిన్ గా, ఇంకొన్ని సినిమాల్లో నెగెటివ్ రోల్స్ తోనూ మెప్పించింది. అయితే ఎందుకోగానీ ఇక్కడ ఎక్కువ కాలం కెరీర్ కొనసాగించలేకపోయింది. అదే సమయంలో డ్రగ్స్ ఆరోపణల్లో చిక్కుకుని జైలుకు కూడా వెళ్లింది. దీంతో ఈ అమ్మడికి క్రమంగా సినిమా అవకాశాలు కనుమరుగయ్యాయి. కాగా కొన్నేళ్ల క్రితమే వివాహం చేసుకున్న ఈ అందాల తార ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు మరోసారి తల్లిగా ప్రమోషన్ పొందనుంది. ఉగాది సందర్భంగా సోషల్ మీడియాలో తన బేబీ బంప్ ఫొటోలను షేర్ చేస్తూ ఈ శుభవార్తను షేర్ చేసుకుంది. మరీ ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా? ఆమె మరెవరో కాదు ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో నటించిన సంజనా గల్రానీ.
2005లో తరుణ్ నటించిన సోగ్గాడు సినిమాతోనే సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది సంజనా గల్రానీ. ఆ తర్వాత ప్రభాస్ బుజ్జిగాడుతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రాజశేఖర్ సత్యమేవ జయతే, శ్రీకాంత్ దుశ్శాసన, ముగ్గురు, యమహో యమహా, అవును 2, సర్దార్ గబ్బర్ సింగ్ తదితర చిత్రాల్లోనూ నటించి మెప్పించిందీ అందాల తార. ఇక కన్నడతో పాటు వివిధ భాషల్లో సంచలన విజయం సాధించిన దండుపాళ్యం సినిమాల్లోనూ నెగెటివ్ పాత్రలో అద్భుతంగా నటించింది సంజన.
కుమారుడితో సంజనా గల్రాని..
View this post on Instagram
2020 లాక్ డౌన్ సమయంలో బెంగుళూరుకు చెందిన అజీజ్ పాషా అనే వైద్యుడితో కలిసి ఏడడుగులు నడిచింది సంజన. 2022లో ఈ దంపతులకు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు మరోసారి తల్లికానుందీ అందాల తార. ‘ఈ కొత్త వెలుగు మీ జీవితంలో శాంతి, శ్రేయస్సు, ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ ఉగాది పండుగ నాకు చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే మా కుటుంబంలోకి మరో కొత్త సభ్యుడు అతి త్వరలో మాతో చేరాలని మేము ఎదురుచూస్తున్నాం. మీ ప్రేమ, ప్రార్థనలు, ఆశీర్వాదం మాపై ఎల్లకాలం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో మీరు కోరుకున్నదంతా సాధించాలి’ అనే విషెస్ చెప్పింది.
బేబీ బంప్ తో బుజ్జిగాడు హీరోయిన్..
View this post on Instagram
సంజనా షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




