AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rukmini Vasanth : తనకంటే మూడేళ్ల చిన్నవాడితో రుక్మిణి వసంత్ రొమాన్స్.. కాంతార బ్యూటీ మాముల్ది కాదయ్యో..

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రుక్మిణి వసంత్. సప్త సాగరాలు దాటి సినిమాతో భారీ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ డమ్ సంపాదించుకుంది. ఇటీవలే కాంతార చాప్టర్ 1 సినిమాతో మరో హిట్టు ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ..ఇప్పుడు డ్రాగన్ చిత్రంలో నటిస్తుంది.

Rukmini Vasanth : తనకంటే మూడేళ్ల చిన్నవాడితో రుక్మిణి వసంత్ రొమాన్స్.. కాంతార బ్యూటీ మాముల్ది కాదయ్యో..
Rukmini Vasanth
Rajitha Chanti
|

Updated on: Nov 01, 2025 | 1:51 PM

Share

దక్షిణాది సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు రుక్మిణి వసంత్. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది ఈ కన్నడ భామ. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఈ చిన్నది.. నెమ్మదిగా కన్నడలో అవకాశాలు అందుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొన్నాళ్ల క్రితం సప్త సాగరాలు దాటి సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో అమాయకమైన నటనతో ఆకట్టుకుంది. దీంతో ఈ బ్యూటీ పేరు మారుమోగింది. ఇక ఇటీవలే రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చాప్టర్ 1 సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇందులో రుక్మిణి లుక్స్, యాక్టింగ్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి. దీంతో పాన్ ఇండియా లెవల్లో ఈ అమ్మడు పేరు మారుమోగుంది. కాంతార చాప్టర్ 1 తర్వాత ఆమె గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు జనాలు.

ఇవి కూడా చదవండి : Actress: 150కి పైగా సీరియల్స్.. ఇండస్ట్రీలోనే తోపు హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలిసే భిక్షాటన చేస్తూ ..

కాంతార చాప్టర్ 1 తర్వాత రుక్మిణి వసంత్ ఇప్పుడు డ్రాగన్ చిత్రంలో నటిస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ హైప్ నెలకొంది. తాజాగా ఈ అమ్మడు తనకంటే మూడేళ్ల చిన్నవాడి జోడిగా నటించనున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ సంగీత దర్శకుడి కొడుకుతో కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ సంగీత స్వరకర్త ప్రస్తుతం తన కొడుకుతో కలిసి ఒక సినిమాలో పనిచేస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి :  Actor : 26 అనాథాశ్రమాలు.. 46 ఉచిత పాఠశాలలు.. రియల్ లైఫ్ హీరో.. సమాజం కోసం జీవితం ఇచ్చిన హీరో..

ప్రముఖ సంగీత స్వరకర్త విద్యాసాగర్ కుమారుడు హర్షవర్ధన్ హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి లింగుసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హర్షవర్దన్ జోడిగా రుక్మిణి వసంత్ నటించనున్నట్లు టాక్. త్వరలోనే శ్రీలంకలో షూటింగ్ ప్రారంభం కానుంది. హర్షవర్ధన్ నటి రుక్మిణి వసంత కంటే మూడేళ్లు చిన్నవాడు కావడం గమనార్హం.

ఇవి కూడా చదవండి : ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణి.. సినిమాలు వదిలేసి గూగుల్ కంపెనీ సీఈఓగా.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. ?

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు