Rashmika Mandanna: మరో వివాదంలో చిక్కుకున్న రష్మిక మందన్నా.. సౌత్ కంటే నార్త్ బెటర్ అంట.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Dec 29, 2022 | 8:22 AM

దక్షిణాది సినిమాల్లో అన్నీ మసాలా పాటలే ఉంటాయంటూ వెటకారంగా కామెంట్స్ చేసింది. సౌత్ సినిమాల్లో ఐటెం నంబర్స్, డ్యాన్స్ నంబర్సే ఎక్కువ అంటూ ఎద్దేవా చేసింది. ప్రస్తుతం ఆమె మాటలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

Rashmika Mandanna: మరో వివాదంలో చిక్కుకున్న రష్మిక మందన్నా.. సౌత్ కంటే నార్త్ బెటర్ అంట.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..
Rashmika Mandanna

పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకుంది రష్మిక మందన్నా. ఈ మూవీతో దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలోనూ వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీ అయ్యింది. ఇప్పటికే హిందీలో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ చిన్నది.. ఇటీవల గుడ్ బై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో అమ్మడి ఆశలన్ని యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో నటిస్తున్న మిషన్ మజ్ను పైనే పెట్టుకుంది. కానీ ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి షాకిచ్చారు మేకర్స్. ప్రస్తుత ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గోంటున్న రష్మిక.. తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. సౌత్ సాంగ్స్ కంటే నార్త్ సాంగ్స్ బాగుంటాయంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాకుండా.. చిన్నప్పటి నుంచి బాలీవుడ్ సాంగ్స్ చూస్తూనే తాను పెరిగినట్లు వెల్లడించింది. అలాగే దక్షిణాది సినిమాల్లో అన్నీ మసాలా పాటలే ఉంటాయంటూ వెటకారంగా కామెంట్స్ చేసింది. సౌత్ సినిమాల్లో ఐటెం నంబర్స్, డ్యాన్స్ నంబర్సే ఎక్కువ అంటూ ఎద్దేవా చేసింది. ప్రస్తుతం ఆమె మాటలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

దీంతో రష్మికపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు నెటిజన్స్. సౌత్ సినిమాల్లో నటించి పాపులర్ అయిన నువ్వు బాలీవుడ్ లో నాలుగు సినిమాలు చేయగానే ఇక్కడి చిత్రాలను అవమానిస్తావా ? అంటూ చురకలు అంటిస్తున్నారు. ప్రస్తుతం నువ్వు బెస్ట్ అంటున్న బాలీవుడ్ నుంచి ఈ ఏడాది ఒక్క సక్సెస్ సినిమా గానీ.. పాన్ ఇండియా చిత్రం గానీ రాలేదంటూ కామెంట్స్ చేయగా.. ఆమెను కేవలం కన్నడలోనే కాదు.. సౌత్ ఇండస్ట్రీలోనే బ్యాన్ చేయాలంటూ మరో కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారు.

రష్మికకు వివాదాలు కొత్తేం కాదు. గతంలో తనకు మొదటి ఛాన్స్ ఇచ్చిన నిర్మాణ సంస్థ పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్ అంటూ చేతి వేళ్లతో యాటిట్యూడ్ చూపించింది. ఇక ఆమె మాటలకు డైరెక్టర్ రిషబ్ శెట్టి కౌంటరిచ్చారు. దీంతో రష్మిక ప్రవర్తనపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను కన్నడలో బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇక ఇప్పుడు మరోసారి సౌత్ సినిమాల కంటే నార్త్ బెటరంటూ కామెంట్స్ చేసి చిక్కుల్లో పడింది. చూడాలి ఈ వ్యాఖ్యలకు రష్మిక ఎలా వివరణ ఇస్తుందో మరి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu