Ajith Kumar: అజిత్ వాట్సాప్ డీపీ ఏముంటుందో తెలుసా..? లీక్ చేసిన హీరోయిన్..
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓవైపు చేతినిండా సినిమాలు.. మరోవైపు కార్ రేసింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇటీవలే అతడు నటించిన గుడ్ బ్యా్డ్ అగ్లీ మూవీ ఏప్రిల్ 10న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో అజిత్ సరసన త్రిష కథానాయికగా నటించగా.. భారీ వసూళ్లతో థియేటర్లలో దుమ్మురేపుతోంది ఈ మూవీ.

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుని కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. ఇందులో త్రిష కథానాయికగా నటించగా.. ప్రియా ప్రకాష్ వారియర్ స్పెషల్ సాంగ్ చేసింది. ఓవైపు సినిమాలు.. మరోవైపు కార్ రేసింగ్ తో బిజీగా ఉన్నాడు అజిత్. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ వేడుకలో అజిత్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్. అలాగే ఈ హీరో వాట్సాప్ డీపీ ఏముంటుందో చెప్పుకొచ్చింది. ప్రియా ప్రకాష్ వారియర్.. 2018లో తనకా అనే మలయాళీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2019లో ఒరు అదార్ లవ్ సినిమాతో కథానాయికగా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతోపాటు అద్భుతమైన నటనతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది ప్రియా.
ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత చెక్, ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మకు అంతగా అవకాశాలు రాలేదు. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం భాషలలో ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో కొన్నాళ్లుగా సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది ప్రియా. తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో స్పెషల్ సాంగ్ తో తిరిగి ఫాంలోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ.
గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో స్పెషల్ సాంగ్ తో ఓవర్ నైట్ స్టార్ గా మారిన ప్రియా.. తాజాగా అజిత్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇటీవల జరిగిన గుడ్ బ్యా్డ్ అగ్లీ సక్సెస్ ఈవెంట్ లో ప్రియాను ఉద్దేశిస్తూ.. మీ దగ్గర అజిత్ సార్ నంబర్ ఉందా ? అని హోస్ట్ అడగ్గా.. అవును అని చెప్పుకొచ్చింది. వాట్సాప్ డీపీ ఏం ఉంటుందని అడగ్గా.. కారు రేసింగ్ చేస్తున్న ఫోటో ఉంటుందని చెప్పేసింది ప్రియా. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇటీవల కొన్ని రోజులుగా అజిత్ కారు రేసింగ్ పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :