AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pooja Hegde: పూజా హెగ్డే మనసు కూడా అందమే.. ఆల్‌ అబౌట్‌ లవ్‌ పేరుతో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బుట్టబొమ్మ.

Pooja Hegde: టాలీవుడ్‌లో అనతి కాలంలో అగ్ర హీరోయిన్‌ల జాబితాలో చోటు దక్కించుకుంది అందాల తార పూజా హెగ్డే. తన అందం అభినయంతో కుర్రకారును మెస్మరైజ్‌ చేసిన ఈ చిన్నది వరుస...

Pooja Hegde: పూజా హెగ్డే మనసు కూడా అందమే.. ఆల్‌ అబౌట్‌ లవ్‌ పేరుతో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బుట్టబొమ్మ.
Pooja Hegde
Narender Vaitla
| Edited By: Ravi Kiran|

Updated on: Jul 23, 2021 | 9:09 AM

Share

Pooja Hegde: టాలీవుడ్‌లో అనతి కాలంలో అగ్ర హీరోయిన్‌ల జాబితాలో చోటు దక్కించుకుంది అందాల తార పూజా హెగ్డే. తన అందం అభినయంతో కుర్రకారును మెస్మరైజ్‌ చేసిన ఈ చిన్నది వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం చేతి నిండి సినిమాలతో సక్సెస్‌ ఫుల్ యాక్టరస్‌ రాణిస్తోన్న పూజా హెగ్డే ఇటీవల తనలోని మరో కోణాన్ని బయటపెట్టింది. కేవలం తన రూపమే కాదు మనసు కూడా అందమైనదేనని చాటి చెప్పిందీ బుట్టబొమ్మ. ఇప్పటి వరకు సమాజం నుంచి లాభం పొందిన పూజా ఇకపై సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ‘ఆల్‌ అబౌట్‌ లవ్‌’ పేరుతో ఇటీవలే ఓ స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టిన సమాజానికి సేవ చేసే లక్ష్యంతో ఈ ఫాండేషన్‌కు నాంది పలికాను. పిల్లలకు వైద్య, ఆర్థికపరమైన సహాయసహకారాలు అందించడమే ‘ఆల్‌ అబౌట్‌ లవ్‌’ ముఖ్య లక్ష్యం. నా శక్తిమేరకు సమాజానికి చేయనున్న చిరు సేవ ఇది. ప్రేమతో ఏ చిన్న సహాయం చేసినా అది ప్రపంచాన్ని మార్చేస్తుంది నేను బలంగా విశ్విసిస్తాను’ అని చెప్పుకొచ్చింది పూజా. ఇక పూజా ఈ ఫౌండేషన్‌ను స్థాపించక ముందు కూడా కొన్ని సేవా కార్యక్రమాలను చేపట్టింది. తన సొంతూరు అయిన మంగళూరులో క్యాన్సర్‌తో బాధపడుతున్న కొందరు చిన్నారుల వైద్య ఖర్చులను భరించడంతో పాటు వందమంది దినసరి కూలీలకు నెలకు సరిపోయే నిత్యావసర వస్తువుల్ని అందించింది. ఇక పూజా కెరీర్‌ విషయానికొస్తే ఈ అమ్మడు ప్రస్తుతం ప్రభాస్‌ సరసన రాధేశ్యామ్‌తో పాటు మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌, ఆచార్య చిత్రాల్లో నటిస్తోంది.

Also Read: Tulasi Love Story: సినిమా స్టోరీని తలపించే ఆ సీనియర్ నటి ప్రేమ పెళ్లి… కలుసుకున్న రోజునే లవ్.. కొన్ని గంటలకే వివాహం..

Srikanth Addala: మరోసారి మల్టిస్టారర్‌పై శ్రీకాంత్ అడ్డాల గురి.. ప్రొడ్యూసర్ రెడీ

Mahesh Babu: మహేష్ అభిమానులకు పండగే.. సూపర్ స్టార్ బర్త్ డే కు డబుల్ ట్రీట్..