AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tulasi Love Story: సినిమా స్టోరీని తలపించే ఆ సీనియర్ నటి ప్రేమ పెళ్లి… కలుసుకున్న రోజునే లవ్.. కొన్ని గంటలకే వివాహం..

Tulasi Love Story: తొలి చూపులోనే ప్రేమ పుట్టడం.. అది పెళ్లి చేసుకోవడం వారు జీవితాంతం సంతోషంగా ఉండడం ఇవన్నీ సినిమాల్లో జరిగే స్టోరీలు.. అయితే సినీ ఇండస్ట్రీలోని..

Tulasi Love Story: సినిమా స్టోరీని తలపించే ఆ సీనియర్ నటి ప్రేమ పెళ్లి... కలుసుకున్న రోజునే లవ్.. కొన్ని గంటలకే వివాహం..
Tulasi Family
Surya Kala
|

Updated on: Jul 22, 2021 | 9:43 PM

Share

Tulasi Love Story: తొలి చూపులోనే ప్రేమ పుట్టడం.. అది పెళ్లి చేసుకోవడం వారు జీవితాంతం సంతోషంగా ఉండడం ఇవన్నీ సినిమాల్లో జరిగే స్టోరీలు.. అయితే సినీ ఇండస్ట్రీలోని చాలా పెళ్లిళ్లు ప్రేమ పెళ్లిలే.. కానీ ఎక్కువమంది కపుల్స్ విడాకులు తీసుకోవడంతో.. డైవర్స్ ఇక్కడ సహజమే అన్నట్లుగా మారిపోయాయి సినీ ఇండస్ట్రీ పెళ్లిళ్లు. అయితే కొద్దిమంది మాత్రం ప్రేమను పండించుకుని పెళ్లి చేసుకుని పదికాలాలు సంతోషంగా జీవిస్తున్నారు. తాము చాలా కాలంగా ప్రేమించుకున్నామని.. ఇప్పుడు పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకున్నామని అనే జంటలే ఎక్కువ అయితే ఈ నటి ప్రేమ పెళ్లి మాత్రం అందుకు భిన్నం.. ఉదయం ప్రేమలో పడి.. సాయంత్రం వివాహం చేసుకుంది.. ఆ నటి గురించి వివరాల్లోకి వెళ్తే..

తులసి బాలనటిగా వెండి తెరపై అడుగు పెట్టింది. శంకరాభరణం సినిమాలో మంజుల కూతురుగా శంకర శాస్త్రి శిష్యురాలిగా తులసి నటన ఇప్పటికీ సినీ అభిమానుల మనసులో ముద్రించుకుంది. తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసినా కాలక్రమంలో చెల్లెలు, అక్క, వదిన, అమ్మ వంటి క్యారెక్టర్లకు షిప్ట్ అయ్యింది. ఏ పాత్ర అయినా సినీ ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంటుంది. ఇటీవల తులసి ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి జరిగిన విధానం గురించి రివీల్ చేసింది.

తులసి.. సెల్వమణి తో ప్రేమ పెళ్లి గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తులసి కన్నడ భాషలో 1995 లో ‘మదర్ ఇండియా’ సినిమాలో నటించడానికి చెన్నై కి వెళ్ళినప్పుడు.. అక్కడ అప్పుడు కన్నడ దర్శకుడు సెల్వమణి తో పరిచయం అయ్యిందట. సెల్వమణిని షూటింగ్ లో చూసినప్పుడు తనకు ప్రేమ వంటి ఫీలింగ్ కలిగిందని చెప్పింది. అయితే పెళ్లి చేసుకుందాం అని అడిగింది మాత్రం తులసి కాదట.. సెల్వమణి అట.

ఆరోజు షూటింగ్ పూర్తి అయిన తర్వాత తులసి సెల్వమణి దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది తులసి. తమ ప్రేమ..పెళ్లి కేవలం ఒక్కరోజులోనే జరిగిపోయిందంటూ అప్పటి రోజులను గుర్తు చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. తులసి తన భర్త గురించి తమ ప్రేమ గురించి మరిన్ని విశేషాలు చెబుతూ..సెల్వమణికి మొదట్లో సిగరెట్ కాల్చే అలవాటు ఎక్కువ ఉండేదని, అయితే తనకు పొగ ఎలర్జీ వల్ల బాధపడుతున్నానని తెలుసుకుని సిగరెట్ కాల్చడం మానేశాడని తులసి చెప్పింది. ఈ దంపతులకు

Also Read: Sanskrit In Village: వారు అందులోనే మునిగి తేలుతుంటారు.. ఆ గ్రామంలో సంస్కృత పరిమళం.. చదువులో అందరూ టాపర్స్..