Sanskrit In Village: వారు అందులోనే మునిగి తేలుతుంటారు.. ఆ గ్రామంలో సంస్కృత పరిమళం.. చదువులో అందరూ టాపర్స్..

Sanskrit In Village: భారత దేశం అతిపురాతన దేశం. మనదేశంలో అనేక భాషలు, సంప్రాదయాలున్నాయి. ఇక భారత దేశంలో గల ప్రాచీన భాషల్లో అతి పురాతనమైన భాష సంస్కృతం..

Sanskrit In Village: వారు అందులోనే మునిగి తేలుతుంటారు.. ఆ గ్రామంలో సంస్కృత పరిమళం.. చదువులో అందరూ టాపర్స్..
Sanskrit In Village
Follow us

|

Updated on: Jul 22, 2021 | 9:13 PM

Sanskrit In Village: భారత దేశం అతిపురాతన దేశం. మనదేశంలో అనేక భాషలు, సంప్రాదయాలున్నాయి. ఇక భారత దేశంలో గల ప్రాచీన భాషల్లో అతి పురాతనమైన భాష సంస్కృతం. ఆధునికత పేరుతో మనం సంస్కృతి, సంప్రదాయాలను పక్కన పెడుతున్నట్లే.. మన ప్రాచీన భాష అయిన సంస్కృతాన్ని కూడా మరచిపోయాం. అయితే మనం మరచిన ఈ భాషను ప్రపంచ దేశాలు ఆదరిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే సంస్కృతభాష.. ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంటోంది. ఈ భాష విశిష్టతను గుర్తించిన అనేక దేశాలు నెత్తిన పెట్టుకోవడం ప్రారంభించాయి. అయితే మనదేశంలోని ఓ ఊరిలో సంస్కృత భాషా వినిపిస్తోంది. ఆ ఊరిలో ఏ ఇంటికి వెళ్లినా.. ఎవరిని పలకరించినా కాళిదాసు నోటినుంచి సంస్కృత భాష అసువుగా వచ్చినట్లు అక్కడి వారిని నోటినుంచి సంస్కృత భాషా సుగంధాలే విరజిమ్ముతాయి. ఒక్క ఇంగ్లీషు పదమైనా మచ్చుకైనా వినిపించదు.. సంస్కృత భాషా పరిమిళాన్ని పంచుతున్న ఆ గ్రామం ఎక్కడ ఉందొ వివరాల్లోకి వెళ్తే..

కర్ణాటక శివమొగ్గ జిల్లాలో మత్తూర్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో దాదాపు ఐదువేల మంది నివసిస్తుంటారు. ఇక్కడ గ్రామంలో నివసించే గ్రామస్థులు కొన్ని శతాబ్దాలుగా సంస్కృత భాషలోనే మాట్లాడుతున్నారు. మత్తూర్ లో ప్రజలందరూ ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేవరకూ తమ కార్యకలాపాలు, ఆచార వ్యవహారాలు, వ్యాపార విషయాలు అన్నీ సంస్కృతం భాషలోనే నిర్వహిస్తున్నారు. ఈ గ్రామంలోని ప్రతి వ్యక్తి చదువు తో సంబంధం లేకుండా 8, 9 ఏళ్ల వయసు నుంచే సంస్కృత శ్లోకాలు వల్లె వేస్తారు. సంస్కృతం అనేది ఆ గ్రామస్థుల మాతృభాష కనుక అమ్మ భాషకు విలువ ఇస్తూ.. ఆ గ్రామస్థులు అన్ని వ్యవహారాలను చేస్తుంటారు.

ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నవారైనా సరే.. ముత్తూర్ కి చేరుకోగానే సంస్కృత భాషలోనే మాట్లాడతారు. అయితే ఆ ఊరిలోకి ఎవరైనా బయటవ్యక్తులు వస్తే మాత్రం కన్నడ లో కానీ ఇంగ్లిష్ లోని కానీ సమాధానం చెబుతారు. ఈ గ్రామానికి దాదాపు 600 ఏళ్ల క్రితం కేరళ నుంచి బ్రాహ్మల్లోని సంకేతి అనే తెగకు చెందినవారు వలస వచ్చారు. అప్పట్నుంచీ వాళ్లు సంస్కృతాన్నే వారసత్వంగా కొనసాగిస్తున్నారు. వీరితోపాటు ఇతర వర్గాల ప్రజలు కూడా సంస్కృతంలోనే వ్యవహరించడం విశేషం.

ఈ ముత్తూర్ గ్రామస్థులు సంస్కృతంలో ఎంతటి నిష్ణాతులో తాము చదువుకునే సబ్జెక్ట్ లో కూడా మంచి మార్కులను సంపాదించుకుంటారు. దీనికి కారణం సంస్కృత భాష అని తెలుస్తోంది. ఎందుకంటే సంస్కృత అభ్యాసం వలన ధారణ శక్తి పెంపొందుతుందన్న మన పెద్దల మాటలు నిజమేనని దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక మత్తూర్ కు సమీపంలోనే కవల పల్లె లాంటి మరో ఊరుంది. అదే హోసహళ్లి. తుంగ నది ఒడ్డున గల హోసహళ్లి.. మత్తూర్ తో స్ఫూర్తి పొందింది. కొన్నేళ్లుగా ఇక్కడ కూడా ప్రజలంతా సంస్కృతంలోనే మాట్లాడుతున్నారు. సంస్కృతం నేర్చుకొని అమల్లో పెట్టిన తరువాత తమ భాషా వ్యవహారాలు పరిణతి చెందాయని, తమకు సంస్కృత భాషలో మాట్లాడడం మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని హోసహళ్లి ప్రజలు చెబుతున్నారు.

Also Read:   భారతీయ శిల్పకళ, హిందూ సంప్రదాయాలను అద్దంపట్టేలా అమెరికాలోని ప్రఖ్యాత దేవాలయాలు