Hindu Temples in US: భారతీయ శిల్పకళ, హిందూ సంప్రదాయాలను అద్దంపట్టేలా అమెరికాలోని ప్రఖ్యాత దేవాలయాలు

Hindu Temples In US: భారతీయులు అందులోను తెలుగువారు ఎక్కువగా నివసించే దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ దేశానికి ఉద్యోగ, వ్యాపార నిమిత్తం వెళ్లి శాశ్వత నివాసం ఏర్పరచుకున్న భారతీయులు అధికమే.. ఈ నేపథ్యంలో తమ ఆచార సాంప్రదాయాలను అక్కడకూడా కొనసాగించేలా పలు దేవాలయాలను నిర్మించుకున్నారు. భారతీయ శిల్పకళను కనువిందు చేసేలా అక్కడ ఆలయాలను నిర్మించుకుంది పండగలను జరుపుకుంటున్నారు.

Surya Kala

|

Updated on: Jul 22, 2021 | 8:38 PM

సెంట్రల్ న్యూజెర్సీలోని రాబిన్స్ విల్లెలోని బాప్స్ శ్రీ స్వామినారాయణ మందిరం. ఈ ఆలయం పాలరాయి, చేతితో చెక్కిన శిల్పాలతో పర్యాటకులను, భక్తులను ఆకర్శించే అద్భుత నిర్మాణం . ఆలయ గోడలపై రామాయణ, మహాభారత , వేదాల హైతిహాసాలు శిల్పాలుగా మారి కనువిందు చేస్తున్నాయి.

1 / 8
ఇస్కాన్ సంస్థ నిర్మించిన మరో ఆలయం వెస్ట్ వర్జీనియా లోని న్యూ బృందావనం. ఇక్కడ అనేక భవనాలు, గృహాలు, అపార్ట్మెంట్ భవనాలు సహా  శ్రీ శ్రీ రాధా బృందావన్ చంద్ర ఆలయం (ఆర్‌విసి ఆలయం) ,  ప్రభుపాద ప్యాలెస్ వంటి అనేక నిర్మాణాలున్నాయి. మొత్తానికి ఈ న్యూ బృందావన్  1,204 ఎకరాల స్థలంలో ఉంది.

2 / 8
రాధా మాధవ్ ధామ్ అమెరికాలోని అతిపెద్ద హిందూ దేవాలయం. ఈ ఆలయాన్ని  ప్రతిరోజూ వందలాది మంది సందర్శించుకుంటారు.

3 / 8
 గ్రేటర్ చికాగో లో ఉన్న రామ ఆలయం అమెరికాలోని పురాతన హిందూ ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయంలో అనేక దేవతల విగ్రహాలున్నాయి. ప్రముఖంగా రాముడు, శ్రీ వెంకటేశ్వర.స్వామిని పూజిస్తారు. ఇక శివుడు, గణేశుడు, దుర్గాదేవి వంటి అనేక ఇతర దేవతల విగ్రహాలు ఇక్కడ కనువిందు చేస్తాయి.

4 / 8
 టెక్సాస్ లో నిర్మించబడిన శ్రీ మీనాక్షి అమ్మవారి ఆలయం. ఎంతో సుందరంగా ఉండే ఈ ఆలయానికి దసరా సమయంలో భారీ సంఖ్యలో భక్తులు మీనాక్షి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం సుమారు 5 ఎకరాలలో నిర్మించబడింది. ఆలయం యొక్క తూర్పు రాజగోపురం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక  గుడికి ఉన్న నాలుగు ప్రాకారాలు జూలై 1995 లో నిర్మించబడ్డాయి.

5 / 8
ఉటాలోని రాధాకృష్ణ ఆలయం .. ఈ ఆలయాన్ని ఇస్కాన్ ట్రస్ట్ నిర్మించి, నిర్వహిస్తుంది.  ఈ ఆలయం భారతీయ సంస్కృతి గురించి  శ్రీకృష్ణుడు గురించి  ప్రపంచానికి అవగాహన తెస్తుంది. ఇక్కడ శ్రీకృషుడి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.

6 / 8
1990 లో అట్లాంటాలో  శ్రీ వెంకటేశ్వర ఆలయం నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం ద్రావిడ ఆర్కిటెక్చర్ స్టైల్ లో నిర్మించారు. ఇక్కడ శివుడు , శ్రీ వెంకటేశ్వర స్వామి పూజలను అందుకుంటున్నారు.

7 / 8
తూర్పు పెన్సిల్వేనియా లోని షుయిల్‌కిల్ కౌంటీలోని ఆలయం వ్రజ్. ఇక్కడ శ్రీకృష్ణుడు ప్రధాన దేవుడు.. ఏటా లక్ష మంది హిందువులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

8 / 8
Follow us