- Telugu News Photo Gallery Spiritual photos Ttd has setup new flower garden to provide the flowers for lord sri venkateswaraswamy puja in tirumala
Tirumala Flower Garden: పూలతోటలతో పరిమళ మయం.. తిరుమల కొండలపై పుష్పాల ఉద్యానవనాలు.. చిత్రాలు
తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి కైంకర్యాలకు వినియోగించే పుష్పాలను తిరుమలలోనే పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది.
Updated on: Jul 23, 2021 | 2:33 PM

తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి కైంకర్యాలకు వినియోగించే పుష్పాలను తిరుమలలోనే పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. దాతల సహకారంతో గార్డెన్ విభాగంలో ఉద్యానవనాలను ఏర్పాటు చేసింది. త్వరలోనే తిరుమలలో మరిన్ని ఉద్యానవనాలను ఏర్పాటు చేస్తున్నామని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. శ్రీవారికీ వినియోగించే పుష్పాలను తిరుమలలోనే పండించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి కైంకర్యాలకు అవసరమైన పుష్పాలను పండించేందుకు నూతన పుష్ప ఉద్యానవనాన్ని టీటీడీ ఏర్పాటు చేసింది.

దాదాపు రూ.1.5 కోట్లతో తిరుమల క్షేత్ర పురాణాల్లో పేర్కొన్న విధంగా శ్రీవారి పుష్ప కైంకర్యానికి వినియోగించే మొక్కలతో శిలా తోరణం వద్ద 10 ఎకరాల్లో శ్రీ వేంకటేశ్వర పవిత్ర ఉద్యానవనం ఏర్పాటు చేశారు.

దాతల సహకారంతో గార్డెన్ విభాగం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసింది.

ఇందులో సంప్రదాయ పుష్పాలైన చామంతి, వృక్షి, రోజ, మధురై మల్లెలు, కనకాంబరం, మాను సంపంగి, లిల్లీలు, తులసి, పన్నీరు ఆకు, తదితర మొక్కలను ఏర్పాటు చేశారు. ఈ పుష్పాలను ఏప్రిల్, మే నెలల నుండి శ్రీవారి కైంకర్యాలకు వినియోగించనున్నారు.

గోగర్భం డ్యాం వద్ద శ్రీ వేంకటేశ్వర శ్రీ గంధపు పవిత్ర ఉద్యానవనంలో శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకున్నారు.శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు మరింత ఆధ్యాత్మిక ఆనందాన్ని కల్పించేందుకు దాతల సహకారంతో తిరుమలలోని ఉద్యాన వనాలను టిటిడి అభివృద్ధి చేస్తోంది.
