Tollywood: 54 ఏళ్ల వయసులో స్లిమ్‌గా మారిన హీరోయిన్.. అలా అన్నందుకు అభిమానికి గట్టిగానే ఇచ్చిపడేసింది..
ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఆమె టాప్ హీరోయిన్. వెంకటేశ్, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ముఖ్యంగా తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో సత్తా చాటుతుంది. సహయ నటిగా వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. తాజాగా 54 ఏళ్ల వయసులో పూర్తిగా బరువు తగ్గిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.

సౌత్ ఇండస్ట్రీలో ఆమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో యంగ్ హీరోహీరోయిన్లకు అమ్మగా, అత్త పాత్రలు పోషిస్తూ మరోసారి ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే అటు రాజకీయాల్లోనూ బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా భారీగా వెయిట్ లాస్ అయ్యింది. ఇన్నాళ్లు బొద్దుగా కనిపించిన ఆమె.. ఇప్పుడు 54 ఏళ్ల వయసులో పూర్తిగా బరువు తగ్గి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. పైన ఫోటోలను చూశారు కాదా.. అందులో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు తెలుగు, తమిళ ఇండస్ట్రీలను ఓ ఊపు ఊపేసింది. ఇక ఇప్పటికీ వరుస సినిమాలతో అలరిస్తుంది. త్వరలోనే ఆమె కూతురు సైతం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. ఇంతకీ ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ ఖుష్బూ సుందర్.
ఖుష్బూ సుందర్.. తాజాగా వెయిట్ లాస్ అయ్యింది. ఇన్నాళ్లు బొద్దుగా ఉన్న ఆమె ఇప్పుడు ఇప్పుడు సన్నబడి గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. తన లేటేస్ట్ లుక్ ఫోటోస్ ఇన్ స్టాలో షేర్ చేస్తూ బ్యాక్ టు ద ఫ్యూచర్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అందులో గ్రీన్ కలర్ మోడ్రన్ డ్రెస్ లో ఊహించని విధంగా కనిపించింది. అందులో ఖుష్బూను గుర్తుపట్టడం కష్టమే అన్నట్లుగా కనిపిస్తుంది. అయితే ఖుష్బూ లేటేస్ట్ లుక్స్, వెయిట్ లాస్ కావడంపై కొందరు అభిమానులు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. కానీ మరికొందరు మాత్రం ఎప్పటిలాగే ఖుష్బూ న్యూలుక్స్ పై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు.
మౌంజారో ఇంజెక్షన్ మ్యాజిక్ ఇది.. ఈ విషయం మీ ఫాలోవర్లకు కూడా తెలిసి వాళ్లు కూడా ఈ ఇంజెక్షన్ తీసుకోవాలనే కదా..అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. దీంతో ఖుష్బూ గట్టిగానే కౌంటరిచ్చింది. అసలు మీరు ఎలాంటి వ్యక్తులు ? మీరెప్పుడు మీ ముఖాలను చూపించరు.. ఎందుకంటే మీ లోపల అంతా మురికే.. నీ తల్లిదండ్రులను చూస్తే జాలేస్తోంది అంటూ రీకౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఖుష్భూ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
Back to the future! 💚#greenwithenvy #trendy#transformation #goodhealth #lovingit#Green#GlamourSlam pic.twitter.com/EypIRH9Ovu
— KhushbuSundar (@khushsundar) April 15, 2025
ఇవి కూడా చదవండి :