OTT Movie: స్వామిజీ ముసుగులో అమ్మాయిలతో.. రొమాంటిక్ సీన్స్తో రచ్చ రంభోలా.. ఒంటరిగా చూడాల్సిందే..
ఈమధ్య కాలంలో ఓటీటీలో హారర్, సస్పెన్స్ మిస్టరీ చిత్రాలు ఎక్కువగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా సైతం అలాంటిదే. ఇది ఒక నిజమైన కత ఆధారంగా తెరెక్కించారు. కథలో ఒక మలుపు ఉంటుంది. స్వామిజీ ముసుగులో అమ్మాయిల జీవితాలను నాశనం చేసే ఓ దొంగబాబా సినిమా. ఆద్యంతం ఊహించని మలుపులతో మిమ్మల్ని ఆకట్టుకుంటుంది.

ఇటీవల కాలంలో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో విభిన్నమైన సినిమాలకు డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతుంది. సినిమా ఎప్పుడు తీసినా .. నటీనటులు ఎవరైనా సరే.. కంటెంట్ ఉన్న సినిమాలకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే మూఢ నమ్మకాలు, ప్రజల విశ్వాసాల గురించి వచ్చిన ఓ సినిమా ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. కొంతమంది స్వామీజీలు ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి జీవితాలతో ఆడుకోవడం మనం చూస్తూనే ఉన్నాము. ఆధునిక కంప్యూటర్ యుగంలో కూడా ఇలాంటి సంఘటనలు అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కథ… స్వాతంత్ర్యానికి ముందు జరిగిన ఒక నిజమైన సంఘటన ఆధారంగా రూపొందించారు. ఈ కథ ఒక ధైర్యవంతుడి పోరాటం గురించి. ఇది మహిళలు ఎదుర్కొంటున్న అణచివేత మరియు మోసాన్ని బట్టబయలు చేస్తుంది.
ఈ సినిమా పేరు ‘మహారాజ్’. 2024లో విడుదలైన చారిత్రాత్మక చిత్రం. 1862లో బొంబాయిలో జరిగిన ప్రసిద్ధ ‘మహారాజ్ పరువు నష్టం కేసు’ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ కేసు సౌరభ్ షా రాసిన నవల ఆధారంగా తీసుకున్నారు. ఈ సినిమాతో అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ కథానాయకుడిగా అరంగేట్రం చేసాడు . ఇందులో జైదీప్ అహ్లావత్, షాలినీ పాండే, శర్వరీ వాఘ్ ముఖ్య పాత్రల్లో నటించగా.. సిద్ధార్థ్ పి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని వైఆర్‌ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించగా.. విభిన్నమైన కథతో వచ్చిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ కథ స్వాతంత్ర్యానికి ముందు బొంబాయిలో జరుగుతుంది. ఈ కథలోని ప్రధాన పాత్ర కర్సందాస్ ముల్జీ, ఒక విద్యావంతుడు. సంఘ సంస్కర్త. మహిళల హక్కులు, వితంతు పునర్వివాహం కోసం పోరాడే ధైర్యవంతుడు. మూఢనమ్మకాలను ఎదిరించే సామర్థ్యం ఉన్న వ్యక్తి. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన కర్సందాస్, తన మామ ఇంట్లో పెరిగి కిషోరి అనే యువతితో నిశ్చితార్థం చేసుకుంటాడు. కానీ కిషోరి జదునాథ్ మహారాజ్ (JJ) అనే ఆధ్యాత్మిక గురువుకి భక్తురాలు అవుతుంది. జెజె తన ఆధ్యాత్మిక అధికారాన్ని దుర్వినియోగం చేస్తాడు. అతను “చరణసేవ” పేరుతో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడతాడు. అతడి మోసాన్ని గురించి తెలుసుకున్న కర్సాందాస్ అతడి వ్యవహరం బట్టబయలు చేస్తాడు. ప్రజల్లో అతడిపై ఉన్న మూఢ నమ్మకాన్ని పోగొట్టేందుకు ఒంటరిగా పోరాటం చేస్తుంటాడు.
ఇవి కూడా చదవండి :