OTT Movie: ఓర్నీ.. ఇదెక్కడి క్లైమాక్స్ రా.. నోటి మాట రాకుండా చేసే ట్విస్ట్ ఇది.. ఓటీటీలోనే ది బెస్ట్ థ్రిల్లర్ మూవీ..
ఇప్పుడు ఓటీటీలో హారర్, థ్రిల్లర్, సస్పెన్స్, మిస్టరీ, రొమాంటిక్ జానర్ చిత్రాలు చూసేందుకు నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఇటీవల సినీప్రియుల కోసం ఇలాంటి తరహా సినిమాలు తీసుకువస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం ఓటీటీలో ఓ థ్రిల్లర్ మూవీ దూసుకుపోతుంది. ఈ చిత్రంలోని షాకింగ్ ఎండింగ మిమ్మల్ని నోటి మాట రాకుండా చేస్తుంది.

సినీప్రియులను ఆద్యంతం ఆసక్తిగా.. ఊహించని ట్విస్టులు.. మతిపోగొట్టే క్లైమాక్స్ ఉండే చిత్రాలకు రెస్పాన్స్ ఎక్కువగా వస్తుంది. ఇలాంటి సమయంలోనే ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫామ్ పై ఓ సినిమా దూసుకుపోతుంది. ఒక రహస్య హత్య చుట్టూ తిరిగే ఈ కథ, ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తుంది. ఈ చిత్రం 2020లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఇప్పటికీ ఈ చిత్రానికి అడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. క్రైమ్, మిస్టరీ చిత్రాలను ఇష్టపడితే మీకు ఇది సరైన ఎంపిక. ఈ సినిమా ఒక ముసలి వ్యాపారవేత్త హత్యకు గురవుతాడు. అతడి పెళ్లి, ఫస్ట్ నైట్ రోజే అతడితోపాటు మరో ఇద్దరు హత్యకు గురవుతారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను పోలీసు అధికారి నవాజుద్దీన్ సిద్ధిఖీ పోషించిన జతిల్ యాదవ్‌కు అప్పగిస్తారు. మొదట్లో, అన్ని అనుమానాలు కొత్త భార్య (రాధిక ఆప్టే) పైనే పడతాయి. కానీ దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ, ప్రేక్షకులను నోట మాట రాకుండా చేసే మలుపులు సినిమాలో చోటు చేసుకుంటాయి. చివరి వరకు అసలు దోషి ఎవరో స్పష్టంగా తెలియదు. కానీ నిజాలు బయటపడుతున్న సమయంలో ఒక్కో షాకింగ్ ట్విస్ట్ వస్తుంది.
ఆ సినిమా 2020లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. కోవిడ్ కారణంగా థియేటర్లలో విడుదల కాలేదు. ఒకవేళ థియేటర్లలో విడుదలై ఉంటే, బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించేదని అంటారు. ఇంతకీ ఈ సినిమా ఏంటో చెప్పలేదు కదు.. అదే రాత్ అకేలి హై.. ఇందులో బాలీవుడ్ స్టార్స్ నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే ప్రధాన పాత్రలు పోషఇంచారు. హనీ ట్రెహాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సస్పెన్స్, క్రైమ్ కథను అందిస్తుంది.
సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్ కథలను ఇష్టపడే సినీప్రియులకు ఈ చిత్రం ది బెస్ట్ ఎంపిక. వారాంతపు సెలవులో సినిమాలతో ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఇది సరైన ఛాయిస్. ఇందులో బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్ధిఖీ అద్భుతమైన నటనతో కట్టిపడేశారు. అలాగే రాధికా ఆప్టే, శ్వేతా త్రిపాఠి సైతం తమ సహజ నటనతో మెప్పించారు. ప్రస్తుతం ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి :