AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

9 రోజుల విరామంలో 6 రోజులు మద్యం మత్తులోనే.. కట్ చేస్తే.. 11 రోజుల్లోనే ఖేల్ ఖతం..!

England's Mid-Ashes Noosa Vacation revealed: ఇంగ్లాండ్ పురుషుల క్రికెట్ జట్టు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. కానీ కీలకమైన యాషెస్ సిరీస్‌లో ఘోరంగా ఓడిపోతున్న సమయంలో ఇలాంటి బాధ్యతారాహిత్యం ప్రదర్శించడం ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

9 రోజుల విరామంలో 6 రోజులు మద్యం మత్తులోనే.. కట్ చేస్తే.. 11 రోజుల్లోనే ఖేల్ ఖతం..!
Aus Vs Eng England PlayersImage Credit source: x.com/TheYorkerBal
Venkata Chari
|

Updated on: Dec 23, 2025 | 4:02 PM

Share

Australia vs England: యాషెస్ 2025-26 సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిపోయిన ఇంగ్లాండ్ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం 11 రోజుల ఆటలోనే సిరీస్‌ను 3-0తో కోల్పోయిన బెన్ స్టోక్స్ సేన ప్రవర్తన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముఖ్యంగా రెండో టెస్టుకు, మూడో టెస్టుకు మధ్య దొరికిన 9 రోజుల విరామంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఏం చేశారనే దానిపై బీబీసీ (BBC) ఒక సంచలన నివేదికను విడుదల చేసింది.

9 రోజుల్లో 6 రోజులు మద్యం మత్తులోనే..!

నివేదిక ప్రకారం, ఇంగ్లాండ్ ఆటగాళ్లు రెండో టెస్ట్ ముగిసిన తర్వాత బ్రిస్బేన్‌లో రెండు రోజులు, ఆపై క్వీన్స్‌లాండ్‌లోని నూసా (Noosa) బీచ్ రిసార్ట్‌లో మరో నాలుగు రోజులు.. మొత్తంగా ఆరు రోజుల పాటు విచ్చలవిడిగా మద్యం సేవించినట్లు తెలిసింది. సిరీస్ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు వెళ్లిన ఈ పర్యటన కాస్తా ‘స్టాగ్ పార్టీ’ (Stag-do) లాగా మారిందని మీడియా మండిపడుతోంది.

ఇవి కూడా చదవండి

రోడ్డు పక్కనే మద్యం: కొందరు ఆటగాళ్లు రోడ్డు పక్కన బహిరంగంగా మద్యం తాడుతూ కెమెరాలకు చిక్కారు.

శిక్షణకు దూరం: జట్టు ఫిట్‌నెస్ కోచ్ పీట్ సిమ్ కోస్ట్ రన్ (Group Run) కోసం ఆహ్వానించగా, జట్టులోని కేవలం ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన వారు మద్యం మత్తులో లేదా విశ్రాంతిలో ఉండిపోయారని వార్తలు వినిపస్తున్నాయి.

బజ్‌బాల్‌పై విమర్శలు: ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ అనుసరిస్తున్న ‘బజ్‌బాల్’ వ్యూహం ఇప్పుడు విమర్శలకు గురవుతోంది. ఆటగాళ్లలో క్రమశిక్షణ లోపించిందని, మైదానంలో కంటే పార్టీల్లోనే వారు ఎక్కువ సమయం గడుపుతున్నారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై ఇంగ్లాండ్ క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ స్పందిస్తూ.. “మా ఆటగాళ్లు అతిగా మద్యం సేవించారనే వార్తలపై విచారణ జరుపుతాం. అంతర్జాతీయ స్థాయిలో ఆడే ఆటగాళ్లు ఇలా ప్రవర్తించడం ఆమోదయోగ్యం కాదు. నూసా పర్యటన విరామం కోసం ఉద్దేశించింది, కానీ అది పార్టీగా మారితే మాత్రం సహించేది లేదు” అని స్పష్టం చేశారు.

ఇంగ్లాండ్ జట్టు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. కానీ కీలకమైన యాషెస్ సిరీస్‌లో ఘోరంగా ఓడిపోతున్న సమయంలో ఇలాంటి బాధ్యతారాహిత్యం ప్రదర్శించడం ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..