AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP SSC Exams 2026: ఈ ఏడాది టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు 6.23లక్షల విద్యార్థులు.. 94% మందికి ఇంగ్లిష్‌ మీడియంలోనే!

రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 16, 2026వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల టైం టేబుల్‌ కూడా విడుదల చేసింది. ఇక ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6.23 లక్షల మంది విద్యార్థులు టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు హాజరు కానున్నట్లు..

AP SSC Exams 2026: ఈ ఏడాది టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు 6.23లక్షల విద్యార్థులు.. 94% మందికి ఇంగ్లిష్‌ మీడియంలోనే!
Andhra Pradesh 10th Class Public Exams
Srilakshmi C
|

Updated on: Dec 23, 2025 | 3:57 PM

Share

అమరావతి, డిసెంబర్‌ 23: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 16, 2026వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల టైం టేబుల్‌ కూడా విడుదల చేసింది. ఇక ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6.23 లక్షల మంది విద్యార్థులు టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు హాజరు కానున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడించింది. ఇప్పటికే వచ్చిన పరీక్ష ఫీజు చెల్లింపులు, నామినల్‌ రోల్‌ ఆధారంగా మొత్తం విద్యార్దులు సంఖ్యను తెలిపింది. దాదాపుగా ఈ ప్రక్రియ పూర్తి కావడంతో ప్రభుత్వ పరీక్షల విభాగం తుది జాబితాను తాజాగా రూపొందించింది. టైం టేబుల్‌ ప్రకారం టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్‌ ఒకటో తేదీ వరకు జరగనున్నాయి.

కర్నూలు జిల్లా నుంచి అత్యధికంగా 33,930 మంది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఆ తర్వాత స్థానంలో అనంతపురం జిల్లా ఉంది. ఈ జిల్లా నుంచి 31,979 మంది టెన్త్‌ విద్యార్ధులు పబ్లిక్‌ పరీక్షలకు హాజరుకానున్నారు. అలాగే మొత్తం విద్యార్థుల్లో ఈ ఏడాది దాదాపు 94 శాతం మంది ఇంగ్లిష్‌ మీడియంలోనే పరీక్షలు రాయనున్నారు. ఇక తెలుగు మీడియంలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. 2024లో 1.61లక్షల మంది తెలుగు మీడియంలో పరీక్షలు రాయగా, 2025లో కేవలం 51 వేల మంది మాత్రమే మాతృభాషలో పరీక్షలు రాశారు. 2025-26 విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 32 వేల మంది మాత్రమే పదో తరగతి పరీక్షలు రాస్తున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం అమలు చేస్తున్న నేపథ్యంలో అధిక మంది విద్యార్ధులు ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్షలు రాసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొన్ని ఎయిడెడ్‌ పాఠశాలల్లో తెలుగు మీడియం కొనసాగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం అనధికారికంగా తెలుగు మీడియం నిర్వహిస్తున్నారు.

పబ్లిక్‌ పరీక్షల మూల్యాంకనంలో మార్కుల లెక్కింపులో తప్పులు లేకుండా ఉండేందుకు ఈ సారి ట్యాబ్‌ల ద్వారా మార్కులు నమోదు చేయనున్నట్లు సమాచారం. అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌ నమోదు చేసిన మార్కులను చీఫ్‌ ఎగ్జామినర్‌ పరిశీలిస్తారు. గత పబ్లిక్‌ పరీక్షల ఫలితాల్లో మార్కుల కూడికలు, నమోదులో తప్పులు వెలుగు చూడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
ఎముకలు స్టీల్ లా మారాలంటే మఖానా తప్పనిసరి… ఎందుకో తెలుసుకోండి!
ఎముకలు స్టీల్ లా మారాలంటే మఖానా తప్పనిసరి… ఎందుకో తెలుసుకోండి!
ఏం అదృష్టం రా బాబు.. ఈ నాలుగు రాశుల వారికి పండుగే పండుగ!
ఏం అదృష్టం రా బాబు.. ఈ నాలుగు రాశుల వారికి పండుగే పండుగ!
షుగర్ కంట్రోల్ చేసే 5 అద్భుతమైన పండ్లు..
షుగర్ కంట్రోల్ చేసే 5 అద్భుతమైన పండ్లు..
మెదడును మోసం చేయబోయి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు
మెదడును మోసం చేయబోయి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు
20 ఏళ్లుగా తగ్గని క్రేజ్..ఇప్పటికీ వాట్సాప్ స్టేటస్‌ల్లో మోతే మోత
20 ఏళ్లుగా తగ్గని క్రేజ్..ఇప్పటికీ వాట్సాప్ స్టేటస్‌ల్లో మోతే మోత
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. త్వరలో అకౌంట్లోకి నగదు
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. త్వరలో అకౌంట్లోకి నగదు
రెబల్ స్టార్ కృష్ణంరాజు సొంత కొడుకు ఎలా చనిపోయాడో తెలుసా? పాపం ..
రెబల్ స్టార్ కృష్ణంరాజు సొంత కొడుకు ఎలా చనిపోయాడో తెలుసా? పాపం ..
ప్రాణాలు కాపాడే విద్య ఫ్రీగా నేర్చుకోవాలా? విహారయాత్రకు వెళ్లండి
ప్రాణాలు కాపాడే విద్య ఫ్రీగా నేర్చుకోవాలా? విహారయాత్రకు వెళ్లండి
డబ్బున్నోళ్ల 5 గుప్త రహస్యాలు.. పేదవాడిని రాజుగా మార్చే నిజాలు
డబ్బున్నోళ్ల 5 గుప్త రహస్యాలు.. పేదవాడిని రాజుగా మార్చే నిజాలు