Anushka Shetty: అప్పుడు సూర్య లవర్, భార్యగా.. ఇప్పుడు కార్తీ సినిమాలో పవర్‌ఫుల్ డాన్.. లోకేష్ ప్లాన్ అదిరిపోయింది..
సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు సీక్వెల్ ట్రెండ్ నడుస్తుంది. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ తీసుకువస్తున్నారు మేకర్స్. ఇక ఈ జానర్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అందులో ఖైదీ 2 ఒకటి. కోలీవుడ్ హీరో కార్తీ నటించనున్న ఈప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నారు.

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ గురించి చెప్పక్కర్లేదు. హీరోయిజం.. యాక్షన్ సీన్స్, లవ్ స్టోరీస్ కాకుండా విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ సక్సెస్ సాధిస్తున్నారు. భారీ బడ్జెట్ మూవీస్ కాకుండా కథ బలంగా ఉండే చిత్రాలను నమ్ముకుంటున్నారు. ఇటీవలే సత్యం సుందరం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ ఖైదీ 2 సినిమా కోసం రెడీ అవుతున్నారు. గతంలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇక ఇప్పుడు ఇదే సినిమాకు సీక్వెల్ తీసుకురాబోతున్నారు డైరెక్టర్ లోకేషన్. ప్రస్తుతం ఆయన రూపొందిస్తున్న కూలీ రిలీజ్ అనంతరం ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు టాక్. మరోవైపు చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నింటిని పూర్తి చేసి ఖైదీ 2 సినిమాతో బిజీ కానున్నారు కార్తీ. ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఖైదీ, విక్రమ్, లియో సినిమాలకు ముడిపెడుతూ ఈ చిత్రం ఉంటుందని సమాచారం. అలాగే ఇందులో మరిన్ని కొత్త పాత్రలు యాడ్ కానున్నట్లు తెలుస్తోంది.
అయితే ఖైదీ 2 సినిమాలో ఈసారి హీరోయిన్ రోల్స్ ఎక్కువగా ఉండనున్నాయని.. కానీ గ్లామర్ పరంగా కాకుండా యాక్షన్, పవర్ ఫుల్ రోల్స్ కనిపించనున్నాయని టాక్. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ చిత్రం లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి సైతం లేడీ డాన్ పాత్రలో నటించనుందని టాక్. దీంతో ఖైదీ 2పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.
ఇప్పటికే బిల్లా సినిమాలో పవర్ ఫుల్ డాన్ పాత్రలో కనిపించింది అనుష్క. ఈ సినిమాలో ఆమె యాక్షన్, లుక్స్ అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు లోకేష్, కార్తి కాంబోలో రాబోయే ఖైదీ 2 చిత్రంలో అనుష్క నటించబోయే పాత్ర డోస్ మరింత ఎక్కువగా ఉంటుందని టాక్. ఇందులో ఆమె పాత్ర రగ్గడ్ గా, రఫ్ గా ఉంటుందని.. ఆ విషయంలో లోకేష్ ఎక్కడా రాజీ పడేలా కనిపించడం లేదట. ఇందులో హీరో పాత్రకు ధీటుగా అనుష్క పాత్ర ఉంటుందని సమాచారం. ఇదిలా ఉంటే.. బాహుబలి తర్వాత సినిమాలు తగ్గించేసింది అనుష్క. ఎప్పుడో ఒక మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇటీవలే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో అలరించిన స్వీటీ.. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బిజీగా ఉంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..