Tollywood : కొడుకు ఫోటో షేర్ చేసిన టాలీవుడ్ హీరో.. నాయినొచ్చిండు అంటూ ఎమోషనల్ పోస్ట్..
తెలుగు సినిమా ప్రపంచంలో ఇప్పుడిప్పుడే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరో తిరువీర్. విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ సినీప్రియులను అలరిస్తున్నారు. తాజాగా తన జీవితంలోని శుభవార్తను అభిమానులనుతో పంచుకున్నారు. తాను తండ్రిగా ప్రమోషన్ పొందినట్లు వెల్లడించారు. తన కొడుకు చేతి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే తనదైన ముద్రవేసిన యంగ్ హీరో తిరువీరు. ఇప్పుడిప్పుడే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన తిరువీర్.. ఆ తర్వాత హీరోగా మారారు. 2016లో బొమ్మలరామారం సినిమాతో సినీరంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత టక్ జగదీష్, పరేశాన్, మసూద వంటి చిత్రాల్లో కీలకపాత్రలు పోషించారు. నటుడిగా తిరువీర్ కెరీర్ మలుపు తిప్పిన సినిమా మసూద. ఈ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 2022లో వచ్చిన మసూద సినిమా అతడి కెరీర్ కు బలమైన టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఆ తర్వాత పరేషాన్ సినిమాతో మరింత ఫేమస్ అయ్యాడు..
ఇవి కూడా చదవండి : Actress Vahini : అప్పుడు సీరియల్స్‌తో క్రేజ్.. క్యాన్సర్‌తో పోరాటం.. సాయం కోరుతూ పోస్ట్..
ప్రస్తుతం సినిమాలు, ఓటీటీల్లో వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటున్నాడు. ఇటీవలే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా హీరోగా తిరువీర్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇదెలా ఉంటే.. తాజాగా ఈ హీరో గుడ్ న్యూస్ పంచుకున్నారు. తాను తండ్రిగా ప్రమోషన్ పొందినట్లు తెలిపారు. తన కొడుకు చేతి ఫోటోను షేర్ చేస్తూ.. “నాయినొచ్చిండు❤️ “ రాసుకొచ్చారు. ప్రస్తుతం తిరువీర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారడంతో నెటిజన్స్, సినీప్రముఖులు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Tollywood : అలాంటి సీన్స్ చేయడానికి ఓకే.. కానీ లిప్ లాక్ అతడికి మాత్రమే.. టాలీవుడ్ హీరోయిన్..
నాయినొచ్చిండు ❤️ pic.twitter.com/7IzM5OAE03
— Thiruveer (@iamThiruveeR) December 12, 2025
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..
ప్రస్తుతం తిరువీర్ చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇటు విభిన్న కంటెంట్ చిత్రాలతోపాటు పలు వెబ్ సిరీస్ సైతం చేస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ భరత్ భూషణ్ దర్శకత్వంలో గంగా ఎంటర్టై్న్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్న ఒక ప్రాజెక్టులో హీరోగా నటిస్తున్నారు. ఇందులో ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఓ సుకుమారి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇవే కాకుండా మరిన్ని సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Tollywood : అవకాశం ఇస్తానని ఇంటికొచ్చి మరీ అలా ప్రవర్తించాడు.. గుప్పెడంత మనసు సీరియల్ నటి..




