ఇంట్లోనే సినిమా థియేటర్.. కేవలం రూ.5 వేలకే.. మీరు సెటప్ చేసుకోండి
Projectors: సినిమా టికెట్ రేట్లు సామాన్యులకు అందనంత ఎత్తులోకి చేరుకుంటున్నాయి. టికెట్ రేటు రూ.300 వరకు ఉంటుండటంతో ధియేటర్‌కు వెళ్లి సినిమా చూసేవాళ్లు భారీగా తగ్గిపోతున్నారు. అంత ఖర్చు పెట్టలేక థియేటర్ల వైపే వెళ్లడం లేదు. అలాంటి వారికి తక్కువ ధరలో లభించే ప్రొజెక్టర్లు బాగా ఉపయోగపడుతున్నాయి.

ఒకప్పుడు సినిమా చూడాలంటే రూ.50లతో అయిపోయేది. ఫ్యామిలీ అంతా కలిసి సినిమాకు వెళ్లినా రూ.500 అవుతాయి. కానీ ఇప్పుడు టికెట్ రేట్లు భారీగా పెరిగాయి. ఒక్కరు సినిమాకు వెళ్లాలన్నా రూ.500 వరకు ఖర్చు అవుతుంది. ఇక సినిమా థియేటర్లతో పాప్ కార్న్, సమోసాలా లాంటివి తినాలంటే రూ.వెయ్యి వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో సినిమా థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. టీవీల్లోనే లేదా ఓటీపీ ఫ్లాట్‌ఫామ్స్‌లోనే ప్రేక్షకులు తక్కువ ఖర్చుతో సినిమా చూస్తున్నారు. ఇక మార్కెట్లో పెద్ద పెద్ద స్క్రీన్స్ గల టీవీలు అందుబాటులోకి వచ్చినా .. ఇవి కొనుగోలు చేయాలంటే లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. అలాంటి వారికి మంచి ఆప్షన్ ప్రొజెక్టర్లు. తక్కువ ధరకే లభించి ప్రొజెక్ట్‌లతో మీ ఇంట్లోనే సినిమా ధియేటర్ లాంటి అనుభవం పొందవచ్చు.
రూ.5 వేలకు ప్రొజెక్టర్లు
స్మార్ట్ టీవీ చిన్నది కొనాలంటే రూ.20 వరకు పడుతుంది. అదే పెద్ద అంగుళాల టీవీ అయితే రూ.50 వేల వరకు ఉంటుంది. అయితే రూ.5 వేలకు ప్రస్తుతం మార్కెట్లో ప్రొజెక్టర్లు లభిస్తున్నాయి. వీటిని మీరు ఇంట్లోనే సులభంగా ఏర్పాటు చేసుకుని సినిమా ధియేటర్ లాంటి ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. చాలా కంపెనీల ప్రొజెక్టర్లు రూ.5 వేలలోపే ఉన్నాయి. మంచి క్వాలిటీతో పాటు హెచ్‌డీ రిజల్యూషన్‌ను కూడా ఇవి అందిస్తున్నాయి.
Protronics Beam 440
ఈ ప్రొజెక్టర్ ధర మార్కెట్లో ప్రస్తుతం రూ.4,471గా ఉంది. 720పీ హెచ్‌డీ రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఇక 3W ఇన్‌బిల్ట్ స్పీకర్ కూడా ఇందులో ఉంది. ఇక XElectron Techno ప్రొజెక్టర్ రూ.4,990కే లభిస్తుంది. ఇది 4కే రిజల్యూషన్‌తో పాటు మంచి బ్రైట్‌నెస్‌ను కూడా అందిస్తుంది.
Lifelong ప్రొజెక్టర్
ఇక ఈ కంపెనీ ప్రొజెక్టర్ ధర రూ.4,499గా ఉంది. అలాగే Wzatco Yuva Go ప్రొజెక్టర్ ధర కూడా రూ.4,999గా ఉంది. ఇది 4కే రిజల్యూషన్‌తో పాటు బ్లూతూట్ కనెక్టివిటీని అందిస్తంది. ఈ ప్రొజెక్టర్‌ను ఇంట్లో ఏర్పాటు చేసుకుని మీరు సినిమా థియేటర్ల అనుభవాన్న పొందవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్లలో ఈ ప్రొజెక్టర్లు అందుబాటులో ఉన్నాయి.




