Electric Blankets: చలి పరార్.. మార్కెట్లో ఎలక్ట్రిక్ దుప్పట్లు.. కొనుగోలు చేసేముందు ఇవి తెలుసుకోండి
మార్కెట్లో ఇప్పుడు ఎలక్ట్రిక్ దుప్పట్లు అందుబాటులో ఉన్నాయి. చలికాలంలో వీటిని ఎక్కువమంది కొనుగోలు చేస్తున్నారు. వీటిని తీసుకునేముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవగాహన లేకుండా ఏది పడితే అది కొనుగోలు చేస్తే ఇబ్బంది పడే అవకాశముంది. అందులో ఈ సూచనలు పాటించండి.

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయి. దీని వల్ల చలి పులి పంజా విసురుతోంది. చలితో ప్రజలు వణికిపోతున్నారు. రాత్రి, ఉదయం వేళల్లో చలికి తట్టుకోలేక బయటకి వచ్చేందుకు ప్రజలు ఆసక్తి చూపించడం లేదు. మార్చి వరకు చలి ఇలాగే కొనసాగే అవకాశముందని వాతావరణశాఖ చెబుతోంది. దీంతో చలితో హీటర్లు, గీజర్లు వినియోగం భారీగా పెరిగిపోయింది. దీంతో పాటు ఇప్పుడు మార్కెట్లోకి ఎలక్ట్రిక్ దుప్పట్లు కూడా వచ్చేశాయి. చలి పెరుగుతున్న క్రమంలో ఉపశమనం పొందేందుకు ఎలక్ట్రిక్ దుప్పట్లను చాలామంది వినియోగిస్తున్నారు. దీంతో వీటి సేల్స్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయాయని చెప్పవచ్చు.
ప్రముఖ ఆన్‌లైన్ ఈ కామర్స్ వెబ్‌సైట్లలో ఎలక్ట్రిక్ దుప్పట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముందుగా కొనేటప్పుడు దానికి BIS ధృవీకరణ లేదా ISI ధృవీకరణ ఉందా.. లేదా అనేది చూడండి. విద్యుత్ దుప్పట్లను తయారు చేయలంటే ప్రభుత్వం నుంచి బీఐఎస్ సర్టిఫికేషన్ పొందాల్సి ఉంటుంది. మీరు కొనాలనుకుంటే వాటిని చెక్ చేసుకోవాల్సి ఉంది. ఇక దుప్పటి లోపల వైరింగ్ నాణ్యత చూడండి. అలాగే ఫాబ్రిక్ క్వాలిటీ కూడా చెక్ చేయండి. వైర్ విరిగితే కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. దీంతో వైర్ బలంగా ఉండేలా చూసుకోండి
ఇక మీరు కొనుగోలు చేయాలనుకునే ఎలక్ట్రిక్ దుప్పటిలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో చెక్ చేసుకోండి. టెంపరేచర్ సెట్టింగ్స్, ఆటో షట్ డౌన్, ఆటో ఆఫ్ ఫీచర్, మల్టిపుల్ టెంపరేచర్ వంటి ఫీచర్లను చూడండి. మీరు టైమ్ సెట్ చేసుకుంటే.. ఆ టైమ్ తర్వాత వేడి తగ్గుతుంది. ఇలాంటి ఫీచర్లు చూడండి. ఇక శుభ్రతను తొలగించే కంట్రోలర్ ఉన్న దుప్పటిని ఎంచుకోవడం మంచిది. ఇది ఆటోమేటిక్‌గా దుమ్ము, ధూలిని తొగిస్తుంది .




