AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛీ.. ఛీ.. ఏం మనిషివిరా నువ్వు.. చేసిన తప్పు వద్దన్నందుకు పిల్లనిచ్చిన మామను వదల్లేదు..!

బీరంగూడ ప్రాంతానికి చెందిన చంద్రయ్య కూతురు లక్ష్మీకి రామకృష్ణకు 20 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. చెత్త బండి నడుపుతూ మంజీరానగర్‌లో జీవిస్తున్న రామకృష్ణ, లక్ష్మీ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు. అయితే మద్యానికి బానిసై తరచూ ఇంట్లో గొడవ పడేవాడు లక్ష్మీ భర్త రామకృష్ణ.

ఛీ.. ఛీ.. ఏం మనిషివిరా నువ్వు.. చేసిన తప్పు వద్దన్నందుకు పిల్లనిచ్చిన మామను వదల్లేదు..!
Son In Law Kills Uncle
P Shivteja
| Edited By: |

Updated on: Dec 12, 2025 | 3:20 PM

Share

మద్యం మత్తులో కొంతమంది మనుషులు జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు..వావీరసలు లేకుండా మనం మనుషులం అనే విషయాన్ని మరిచిపోతున్నారు. ఇది తప్పు అని అడ్డుకున్న వాళ్ళపై దాడులు చేస్తూ.. వారిని చంపడానికి సైతం వెనుకాడడం లేదు. ఇలాంటి సంఘటనే సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. అమీన్ పూర్ మండలం బీరంగూడ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. మామ చిత్తారి చంద్రయ్యని కత్తితో ఏడు పోట్లు పొడిచి హత్య చేశాడు అల్లుడు కడమంచి రామకృష్ణ.

బీరంగూడ ప్రాంతానికి చెందిన చంద్రయ్య కూతురు లక్ష్మీకి రామకృష్ణకు 20 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. చెత్త బండి నడుపుతూ మంజీరానగర్‌లో జీవిస్తున్న రామకృష్ణ, లక్ష్మీ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు. అయితే మద్యానికి బానిసై తరచూ ఇంట్లో గొడవ పడేవాడు లక్ష్మీ భర్త రామకృష్ణ. కాగా గత కొన్ని రోజులుగా మధ్యం మత్తులో మాటలు రాని మూగ కూతురుపై చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడు రామకృష్ణ. ఇది గమనించిన భార్య భర్తతో గొడవ పడి పిల్లలను తీసుకుని మూడు నెలల‌ క్రితం బీరంగూడలోని తల్లి గారింటికి వచ్చింది.

కాగా మద్యం సేవించి తరచూ మామ ఇంటికి వచ్చి గొడవ పడేవాడు లక్ష్మీ భర్త రామకృష్ణ.. అయితే ఈ క్రమంలోనే గురువారం (డిసెంబర్ 11) రాత్రి సైతం మామ ఇంటికి వచ్చి, మామతో గొడవకు దిగాడు రామకృష్ణ. తాగిన మైకంలో నానా దుర్భాషలాడడంతో వారించిన మామ చంద్రయ్యపై కర్ర, రోకలి బండతో దాడి చేశాడు. ఇంటికి వచ్చే ముందే జేబులో తెచ్చుకున్న కత్తితో మామపై ఏడు సార్లు కత్తి పోట్లు పొడిచాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు రక్తస్రావంలో ఉన్న చంద్రయ్యను బీరంగూడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చంద్రయ్య మృతి చెందినట్లు నిర్దారించారు వైద్యులు. కూతురు లక్ష్మీ, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు కంచన్‌బాగ్ అపోలో ఆస్పత్రిలో చికిత్స..
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు కంచన్‌బాగ్ అపోలో ఆస్పత్రిలో చికిత్స..
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం