AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: క్రేజీ వీడియోతో ఆర్ఆర్ఆర్ టీంకు కంగ్రాట్స్ చెప్పిన ప్రకాష్ రాజ్.. వైరలవుతున్న పోస్ట్..

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జరిగిన 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకలలో బెస్ట్ ఒరిజినల్.. నాన్ ఇంగ్లీష్ కేటగీరిలో ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ అవార్డు అందుకున్నారు.

RRR Movie: క్రేజీ వీడియోతో ఆర్ఆర్ఆర్ టీంకు కంగ్రాట్స్ చెప్పిన ప్రకాష్ రాజ్.. వైరలవుతున్న పోస్ట్..
Rrr Movie, Prakash Raj
Rajitha Chanti
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 19, 2023 | 8:24 AM

Share

విశ్వ వేదికపై అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు సొంతం చేసుకుంది ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జరిగిన 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకలలో బెస్ట్ ఒరిజినల్.. నాన్ ఇంగ్లీష్ కేటగీరిలో ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ కు అభినందనలు తెలిపారు సినీ, రాజకీయ ప్రముఖులు. ప్రధాని మోదీ.. మెగాస్టార్ చిరంజీవి, నారా చంద్రబాబు నాయుడు, సీఎం జగన్ వంటి ప్రముఖు ట్రిపుల్ ఆర్ బృందానికి కంగ్రాట్స్ తెలిపారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకోవడం పట్ల ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టీం సంతోషంగా సెలబ్రెషన్స్ జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ట్రిపుల్ ఆర్ యూనిట్ కు కంగ్రాట్స్ చెబుతూ షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. తనదైన శైలీలో ఓ క్రేజీ వీడియో షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

నాటు నాటు పాటకు హాలీవుడ్ యాక్టర్స్ లారెల్, హార్టీ డాన్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఆయన షేర్ చేసిన ఈ మాషప్ వీడియో ఫన్నీగా ఉంది.. షేర్ చేసిన తక్కువ సమయంలోనే నెట్టింట చక్కర్లు కొడుతుంది ఈ వీడియో. అయితే ఇదే వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సైతం ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. నాటు నాటటు మేనియా నుంచి ఎవరూ తప్పించుకోలేరు. వీడియోలోని ఆ రెండు పాత్రల్లో ఆర్ఆర్ఆర్ హీరోల్లో కనిపించినంత ఎనర్జీ ఉండకపోవచ్చు. అయినా పర్లేదు. ఎంజాయ్ చేయండి అంటూ రాసుకొచ్చారు ఆనంద్ మహింద్రా.

ఇవి కూడా చదవండి

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించగా.. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, ఒలివియా మోరీస్, శ్రియా, అజయ్ దేవగన్, సముద్రఖని కీలకపాత్రలలో కనిపించారు. ఇందులో చరణ్, తారక్ నటనకు విదేశీయులు సైతం ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాకు సిక్వెల్ కూడా రాబోతుందని.. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని ఇటీవలే హింట్ ఇచ్చారు జక్కన్న.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!