AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani: రానా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన న్యాచురల్ స్టార్.. ఆ పాన్ ఇండియా స్టార్‎తో నటించాలని ఉందని..

ఇటీవల హీరో రానా దగ్గుబాటితో కలిసి సింగర్ స్మిత నిర్వహిస్తున్న నిజం విత్ స్మిత టాక్ షోలో పాల్గొన్న నాని. వీరికి సంబంధించిన 3వ ఎపిసోడ్ ఈరోజు నుంచే స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో రానా, నాని తమ వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.

Nani: రానా గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన న్యాచురల్ స్టార్.. ఆ పాన్ ఇండియా స్టార్‎తో నటించాలని ఉందని..
Nani, Rana
Rajitha Chanti
|

Updated on: Feb 24, 2023 | 5:38 PM

Share

ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్‏గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా గుర్తింపు అందుకున్నారు న్యాచురల్ స్టార్ నాని. అష్టా చమ్మా సినిమాతో హీరోగా వెండితెరపై సందడి చేసిన ఈ హీరో.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఇప్పటివరకు నాని నటించిన చిత్రాలన్ని సూపర్ హిట్ కావడం విశేషం. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా చిత్రం చేస్తున్నారు నాని. ఇందులో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల హీరో రానా దగ్గుబాటితో కలిసి సింగర్ స్మిత నిర్వహిస్తున్న నిజం విత్ స్మిత టాక్ షోలో పాల్గొన్న నాని. వీరికి సంబంధించిన 3వ ఎపిసోడ్ ఈరోజు నుంచే స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో రానా, నాని తమ వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.

ఈ క్రమంలోనే రానాతో తనకున్న అనుబంధాన్ని గురించి చెప్పుకొచ్చారు నాని. అష్టా చమ్మా సినిమా చేసేటప్పుడు నా సినిమా ఎవరు చూస్తారా అనుకునేవాడినని.. అలా మూడు నాలుగు సినిమాలు చేశానని అన్నారు నాని.. ఆ సమయంలో ఇండస్ట్రీకి సంబంధించిన కుటుంబాలలో తనకు ఎవరు తెలియదని తెలిపారు.

“నా సినిమాల గురించిగానీ.. నా నటన గురించి గాని ఎవరూ మాట్లాడేవరాు కాదు. దాంతో నా సినిమాలను ఎవరూ చూడడం లేదేమో అనుకున్నాను. కానీ ఓ మ్యాగజైన్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా నా గురించి మాట్లాడాడు. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన వారిలో ఎవరిపై బెట్ పెడతారనే ప్రశ్నకు ఆయన నా పేరు చెప్పాడు. ఒక పెద్ద ఫ్యామిలీకి చెందిన వ్యక్తి నా గురించి అలా మాట్లాడడం అదే మొదటిసారి. అప్పటికీ నేను బయట రానాను చూడలేదు. కానీ ఆయన పట్ల అభిమానం పెరిగిపోయింది. ఆ తర్వాత మేమిద్దరం కలుసుకున్నాం. మా మధ్య స్నేహం పెరుగుతూనే వచ్చింది. మేము కలిసి నటించాలని ఉంది. చాలాసార్లు ఈ విషయాన్ని మాట్లాడుకున్నాం. అన్ని కలిస్తే కలిసి సినిమా చేస్తాం” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మెస్సీ కోల్‌కతా పర్యటన.. కోర్టు మెట్లెక్కిన భారత మాజీ కెప్టెన్
మెస్సీ కోల్‌కతా పర్యటన.. కోర్టు మెట్లెక్కిన భారత మాజీ కెప్టెన్
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు