Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి.. హీరో మంచు మనోజ్ ఎలా విషెస్ చెప్పాడో తెలుసా?
రేవంత్ రెడ్డి పేరును ముఖ్యమంత్రిగా ప్రకటించడంతో కాంగ్రెస్ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయాయి. అందరూ ఆయనకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. ఇందులో పలువురు సినీ ప్రముఖులు ఉన్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ రేవంత్ రెడ్డి స్పెషల్ విషెస్ తెలిపాడు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. డిసెంబర్ 7న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎం పదవి కోసం పలువురి కాంగ్రెస్ నేతల పేర్లు వినిపించినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి కృషిని గుర్తింపుగా కాంగ్రెస్ హై కమాండ్ ముఖ్యమంత్రి బాధ్యతలను ఆయనకే అప్పగించింది. ఇక రేవంత్ రెడ్డి పేరును ముఖ్యమంత్రిగా ప్రకటించడంతో కాంగ్రెస్ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయాయి. అందరూ ఆయనకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. ఇందులో పలువురు సినీ ప్రముఖులు ఉన్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ రేవంత్ రెడ్డి స్పెషల్ విషెస్ తెలిపాడు. కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి బైక్‌పై వస్తోన్న రేవంత్ రెడ్డి ఫొటోను ట్వి్ట్టర్‌లో షేర్ చేసిన మనోజ్..’ రాష్ట్రంలో అత్యద్భుత విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి, అందుకోసం అలు పెరగని కృషి చేసిన రేవంత్ రెడ్డి అన్నకు ప్రత్యేక అభినందనలు. రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రభావవంతమైన పాలన కోసం ఎదురుచూస్తున్నాం’ అని రాసుకొచ్చాడు.
కాగా గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోన్న మంచు మనోజ్ ఇప్పుడు మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే ఓటీటీలు, టీవీల్లో స్పెషల్ షోస్ చేస్తున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న వాట్ ది ఫిష్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మనం మనం.. బరంపురం అనేది ఈ సినిమా క్యాప్షన్. ఇక ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో ఓ సరికొత్త షో చేయనున్నాడు. దీనికి లేటెస్ట్‌గా ఉస్తాద్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
కంగ్రాట్స్.. రేవంత్ అన్నా..
Big congratulations to @INCIndia and @INCTelangana for the impressive win in #TelanganaElections2023! Sending my best wishes to @revanth_anumula garu for your commendable efforts. Looking forward to witnessing impactful governance ahead! 👍 pic.twitter.com/0W025UNLoS
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 5, 2023
ఉస్తాద్ గా మంచు మనోజ్..
I am delighted to reveal the title of my debut game show, #USTAAD Ramp-Adidham! 🔥 The small screen is about to become wild with entertainment and fun.
I am grateful for your love over the years. Exciting vibes are coming up! 🙌😊
Get ready for a wholesome fun ride! ✨🤗… pic.twitter.com/L2z4FacB5a
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) November 29, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.