AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: ఆరు వేల మంది విద్యార్థులతో మెగాస్టార్ చిరంజీవి అద్భుత దృశ్యకావ్యం.. వీడియో వైరల్..

తాజాగా మెగాస్టార్ చిరంజీవికి మెగా ట్రిబ్యూట్ అందించారు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు. వారు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు డైరెక్టర్ బాబీ.

Megastar Chiranjeevi: ఆరు వేల మంది విద్యార్థులతో మెగాస్టార్ చిరంజీవి అద్భుత దృశ్యకావ్యం..  వీడియో వైరల్..
Megastar Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Oct 30, 2022 | 12:52 PM

Share

మెగాస్టార్ చిరంజీవికి ఉండే అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల్లో చిరు అంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమా వస్తుందంటే భారీ ఓపెనింగ్స్ ఉండాల్సిందే. ప్రస్తుతం యంగ్ హీరోలకు పోటీగా రీఎంట్రీలోను అదరగొడుతున్నారు మెగాస్టార్. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల గాడ్ ఫాదర్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న చిరు.. ఇప్పుడు భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రీకరణలలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో ఇటీవల విడుదలైన వాల్తేరు వీరయ్య టైటిల్‏కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో పక్కా మాస్ లుక్‏లో బాస్ ఈజ్ బ్యాక్ అనేట్టు చేశారు. చాలా కాలం తర్వాత మళ్లీ చిరు అప్పటి చిత్రాలను గుర్తుచేశారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవికి మెగా ట్రిబ్యూట్ అందించారు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు. వారు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు డైరెక్టర్ బాబీ.

మల్లారెడ్డి కాలేజీలో దాదాపు 6 వేల మంది విద్యార్థులు వారి కాలేజీ గ్రౌండ్స్ లో మెగాస్టార్ రూపం తీర్చిదిద్ది ఓ మెగా ట్రిబ్యూట్ అందించారు. నెలపై చిరు రూపంలో కూర్చొని.. వాల్తేరు వీరయ్య గెటప్ లోని చిరు పిక్ తో అదరగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియో చూసిన డైరెక్టర్ బాబీ.. కాలేజీ యాజమాన్యానికి.. విద్యార్థులు చూపించిన ప్రేమకు థాంక్స్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న వాల్తేరు వీరయ్య చిత్రంలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఇందులో మాస్ మాహరాజా రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంక్రాంతికి ఇంటికొచ్చి.. ఫ్రెండ్స్‌తో క్రికెట్‌ ఆడుతూ
సంక్రాంతికి ఇంటికొచ్చి.. ఫ్రెండ్స్‌తో క్రికెట్‌ ఆడుతూ
పచ్చని కాపురంలో ఫోన్‌ చిచ్చు.. భర్తకు తెలియకుండా భార్య ఏం చేసిందో
పచ్చని కాపురంలో ఫోన్‌ చిచ్చు.. భర్తకు తెలియకుండా భార్య ఏం చేసిందో
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
మార్చిలోగా ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
మార్చిలోగా ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
అతను నాకు గురువు.. ఎలా ప్రపోజ్ చేస్తా..!
అతను నాకు గురువు.. ఎలా ప్రపోజ్ చేస్తా..!
బుడ్డోడికి ఏమైనా జరిగుంటే ఎవరిది బాధ్యత..?
బుడ్డోడికి ఏమైనా జరిగుంటే ఎవరిది బాధ్యత..?
రిపబ్లిక్ డే బ్రేక్ కావాలా?.. బడ్జెట్లో 5 బెస్ట్ ప్లేసెస్ ఇవే..
రిపబ్లిక్ డే బ్రేక్ కావాలా?.. బడ్జెట్లో 5 బెస్ట్ ప్లేసెస్ ఇవే..
రోహిత్ లో కసి చచ్చిపోయిందా?..కివీస్ మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్
రోహిత్ లో కసి చచ్చిపోయిందా?..కివీస్ మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోస్టుల వివరాలు తప్పక తెలుసుకోండి
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోస్టుల వివరాలు తప్పక తెలుసుకోండి
ఉపాధి హామీ కూలీలకు గుడ్‌న్యూస్‌.. ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్
ఉపాధి హామీ కూలీలకు గుడ్‌న్యూస్‌.. ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్